నల్లగొండలో విషాదం.. ఒకే ఇంట్లో నలుగురి మృతి
ABN , Publish Date - Jun 22 , 2026 | 08:16 PM
నల్లగొండ పట్టణంలోని తెలంగాణ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో నలుగురు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
నల్లగొండ: పట్టణంలోని తెలంగాణ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో నలుగురు మృతి చెందిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. మృతుల్లో భార్యాభర్తలు సుల్తాన్, హసీనా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరి వివరాలు ఇంకా తెలియరాలేదు. నల్లగొండ ప్రకాశం బజార్‌లో సుల్తాన్ బ్యాగుల వ్యాపారం నిర్వహిస్తుండగా, హసీనా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నట్లు తెలిసింది.
ఈ ఘటన ఆత్మహత్యా? లేక హత్యా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇంట్లో నలుగురు మృతిచెందడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనా స్థలం నుంచి ఆధారాలను సేకరిస్తున్న పోలీసులు, మృతుల బంధువులు, స్థానికులను విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
30 నెలల్లో వినాశనం.. చీకటిని చూస్తేనే వెలుగుకు విలువ: కేటీఆర్
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. వర్చువల్‌గా కోర్టుకు అల్లు అర్జున్ హాజరు
Read Latest Telangana News