Share News

ఒక్క గ్లోబల్‌ సమ్మిట్‌ అయినా నిర్వహించారా?

ABN , Publish Date - Oct 30 , 2026 | 05:13 AM

బీఆర్‌ఎస్‌ పార్టీ పదేళ్ల పాలనలో ఒక్క గ్లోబల్‌ సమ్మిట్‌ అయినా నిర్వహించారా అని కేటీఆర్‌ను ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు.

ఒక్క గ్లోబల్‌ సమ్మిట్‌ అయినా నిర్వహించారా?
Chamala Kiran Kumar Reddy

  • బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనపై కేటీఆర్‌కు ఎంపీ చామల ప్రశ్న

హైదరాబాద్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ పార్టీ పదేళ్ల పాలనలో ఒక్క గ్లోబల్‌ సమ్మిట్‌ అయినా నిర్వహించారా అని కేటీఆర్‌ను ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ పాలనలో తెచ్చింది రూ. 9 లక్షల కోట్ల పెట్టుబడులు కాదని, రూ.8లక్షలకోట్ల అప్పులని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకూడదన్నదే కేటీఆర్‌ లక్ష్యమన్నారు. బీఆర్‌ఎస్‌ పాలనను చూసిన ప్రజలు.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని శాశ్వతంగా అధికారంలో ఉంచుతారన్న భయం కేటీఆర్‌కు పట్టుకుందని విమర్శించారు. ప్రపంచంలో ఎల్‌నినో కారణంగా కరువు, ఏఐ కారణంగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితులు వచ్చాయన్నారు. భవిష్యత్తులో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ పైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని, తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించడానికి, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికే సీఎం రేవంత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నారని తెలిపారు.

Updated Date - Oct 30 , 2026 | 06:26 AM