Share News

సెల్‌ఫోన్ చిచ్చు.. కన్నకూతురిని చంపిన తల్లి

ABN , Publish Date - Oct 30 , 2026 | 08:40 AM

చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు.. సమయం తెలియకుండా అందులోనే గడుపుతున్నారా? మొబైల్ ఫోన్ అతిగా వాడొద్దని చెప్పిన తల్లిదండ్రుల మాట వినలేదని ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది.

సెల్‌ఫోన్ చిచ్చు.. కన్నకూతురిని చంపిన తల్లి
Mobile Phone Dispute

రంగారెడ్డి, అక్టోబర్ 30: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సెల్‌ఫోన్ ఎక్కువగా వాడుతోందన్న కోపంతో ఓ తల్లి తన 14 ఏళ్ల కుమార్తెను గొంతు నులిమి హత్య చేసిన ఘటన కొత్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. హనుమాన్ టెంపుల్ కాలనీలో నివసించే ముయ్యాది రాజు, విజయలక్ష్మి (34) దంపతులకు సువర్ణ అలియాస్ లవ్లీ (14) అనే కుమార్తె ఉంది. ఆమె తొమ్మిదో తరగతి చదువుతోంది. అయితే.. సువర్ణ నిత్యం మొబైల్ ఫోన్‌లోనే గడుపుతుండటంతో తల్లి విజయలక్ష్మి పలుమార్లు మందలించేది. ఈ విషయమై తల్లీకూతుళ్ల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో అక్టోబర్ 27న మరోసారి ఫోన్ వాడకంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన విజయలక్ష్మి కుమార్తె గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.


ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం..

కుమార్తె హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు విజయలక్ష్మి మరో నాటకానికి తెరతీసింది. బాలిక మెడకు చీరతో ఉరి వేసి ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే పోస్టుమార్టం నివేదికలో బాలిక గొంతు నులిమి చంపినట్లు తేలడంతో పోలీసులు అనుమానించారు. విజయలక్ష్మిని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సెల్‌ఫోన్ ఎక్కువగా వాడుతోందన్న కోపంతో తానే కుమార్తెను హత్య చేసినట్లు ఆమె అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో విజయలక్ష్మిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.


ఈ వార్తలనూ చదవండి:

తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు

ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు

Updated Date - Oct 30 , 2026 | 10:31 AM