Share News

బేగంపేట యాక్సిస్ బ్యాంక్‌లో మోసం.. రూ.6.5 కోట్ల గోల్‌మాల్..

ABN , Publish Date - Apr 12 , 2026 | 08:40 PM

బేగంపేట్‌ యాక్సిస్ బ్యాంక్‌లో భారీ మోసం జరిగినట్టు సమాచారం. ఘరానా మోసానికి పాల్పడిన బ్యాంక్ మేనేజర్ వెంకట రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్‌ఆర్ఐ వినియోగదారుడి ఖాతా నుంచి రూ. 6.5 కోట్లు కొట్టేసినట్టు బ్యాంక్‌ మేనేజర్‌ వెంకట రమణపై ఆరోపణలు వచ్చాయి.

బేగంపేట యాక్సిస్ బ్యాంక్‌లో మోసం.. రూ.6.5 కోట్ల గోల్‌మాల్..
Axis Bank Begumpet fraud

హైదరాబాద్: బేగంపేట్‌ యాక్సిస్ బ్యాంక్‌లో భారీ మోసం జరిగినట్టు సమాచారం. ఘరానా మోసానికి పాల్పడిన బ్యాంక్ మేనేజర్ వెంకట రమణను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్ఆర్ఐ వినియోగదారుడి ఖాతా నుంచి రూ. 6.5 కోట్లు కొట్టేసినట్టు ఆరోపణలు వచ్చాయి. వినియోదారుడి సంతకం ఫోర్జరీ చేసి మొత్తంగా 41 విడతల్లో ఈ సొమ్మును కాజేసినట్టు పంజాగుట్ట పోలీసులు పేర్కొన్నారు (Axis Bank Begumpet fraud).


ఈ కేసులో మేనేజర్‌తో పాటు బ్రాంచ్ సీనియర్ అధికారులు, ఆపరేషన్స్ టీమ్ ప్రమేయం కూడా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి (Axis Bank fraud case). డబ్బును ఇతర ఖాతాలకు మళ్లించినట్టు తెలుస్తోంది. అనుమతి లేకుండానే బ్యాంక్ ఖాతా క్లోజ్ చేశారని, సీఈవో దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని బాధితుడు ఫిర్యాదు చేశారు.


తనతో పాటు బ్యాంక్‌లోని అనేక మంది ఇతర ఖాతాదారుల ఖాతాల నుంచి కూడా నగదు మాయమైనట్టు తెలిపారు. 2024లోనే పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశారు. అయితే మేనేజర్ విచారణకు సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. తాజాగా బ్యాంక్ మేనేజర్ వెంకటరమణను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.


ఇవి కూడా చదవండి..

చైనాకు ట్రంప్ వార్నింగ్.. స్పందించిన ఎంబసీ..


ట్రంప్ కార్డు అదేనా.. ఇరాన్‌పై చర్యల గురించి అమెరికా అధ్యక్షుడి హింట్..

Updated Date - Apr 12 , 2026 | 09:16 PM