ఆర్టీసీ కార్మికులను పొట్టన పెట్టుకున్న పాపం కేసీఆర్‌ది: మహేశ్ కుమార్ గౌడ్
ABN , Publish Date - Apr 25 , 2026 | 08:54 PM
బీఆర్ఎస్ హయంలో అనేక మంది ఆర్టీసీ కార్మికులను పొట్టన పెట్టుకున్న పాపం కేసీఆర్‌దని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడటానికి బీఆర్ఎస్ నేతలకు ఏం అర్హత ఉందని ఆయన ప్రశ్నించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 25: బీఆర్ఎస్ హయంలో అనేక మంది ఆర్టీసీ కార్మికులను పొట్టన పెట్టుకున్న పాపం కేసీఆర్‌దని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఆర్టీసీ కార్మికుల గురించి మాట్లాడటానికి బీఆర్ఎస్ నేతలకు ఏం అర్హత ఉందని ఆయన ప్రశ్నించారు. కార్మికులతో సామరస్య పూర్వంకంగా చర్చలు జరిపి, సమస్యలను పరిష్కరించడం ప్రజాస్వామ్య పాలన లక్షణమని పేర్కొన్నారు. శనివారం గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ..
‘2028లో మెజార్టీ మైనారిటీ మెంబెర్స్‌కి టికెట్స్ ఇస్తాం. మైనారిటీ విభాగాన్ని బలోపేతం చేయాలి. కాంగ్రెస్ పార్టీ చరిత్రాత్మకమైన పార్టీ. అమలు కానీ హామీలు ఇచ్చి మోదీ అధికారంలోకి వచ్చారు. అంబానీ, అదానీ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయి. మోదీ ప్రభుత్వంలో పేదవారు పేదవారిగానే ఉన్నారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ దేశాన్ని సమూలంగా చదివారు. తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగా పాలన సాగుతోంది. విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. జిల్లాల్లో పర్యటించి సమావేశాలు ఏర్పాటు చేసి.. మైనారిటీ విభాగాన్ని బలోపేతం చేయాలని ఇర్ఫాన్ అలీకి సూచించాం’ అని తెలిపారు.
ఇవి కూడా చదవండి
అమిత్‌షాపై లీగల్ కేసు వేస్తా: మమతా బెనర్జీ
2028 నాటికి 50 శాతం ప్రభుత్వ సేవలు ఏఐ ద్వారానే.. కీలక ప్రణాళిక ప్రకటించిన యూఏఈ..