కవిత మద్దతుతో సత్తాచాటిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ..
ABN , Publish Date - Feb 13 , 2026 | 12:57 PM
తెలంగాణలో 116 మున్సిపల్, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నువ్వా.. నేనా అంటూ ముందంజలో సాగుతున్నారు. అయితే..
జోగులాంబ గద్వాల జిల్లా: తెలంగాణలో 116 మున్సిపల్, 7 కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నువ్వా.. నేనా అంటూ ముందంజలో సాగుతున్నారు. అయితే జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీలో మాత్రం ఫార్వర్ట్ బ్లాక్ పార్టీ సత్తా చాటింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మద్దతు తెలిపిన ఫార్వర్డ్ బ్లాక్.. 10 వార్డులకు గానూ ఏకంగా 8 వార్డులు కైవసం చేసుకుంది. దీంతో మున్సిపాలిటీ ఫార్వర్డ్ బ్లాక్ సొంతమైంది. మరో రెండు స్థానాలను కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కో స్థానం చొప్పున గెలుచుకున్నాయి.