Share News

భార్య ఆత్మహత్య.. ఆందోళనతో రైలు కింద పడి భర్త మృతి

ABN , Publish Date - Sep 10 , 2026 | 02:04 PM

నిన్నటి వరకూ కలిసి జీవించిన ఆ భార్యాభర్తలు.. ఒక్కరోజులోనే విగతజీవులుగా మారారు. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి తీవ్ర విషాదానికి గురైన భర్త కూడా కొద్దిసేపటికే రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదాన్ని నింపింది.

భార్య ఆత్మహత్య.. ఆందోళనతో రైలు కింద పడి భర్త మృతి
Hyderabad Tragedy

హైదరాబాద్, సెప్టెంబర్ 10: లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. భార్య ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి తీవ్ర ఆందోళనకు గురైన భర్త కూడా ఆత్మహత్యకు పాల్పడటంతో ఒకేరోజు భార్యాభర్తలు మృతి చెందారు. విజయపురి కాలనీలో లక్ష్మి ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. భర్త చరణప్ప.. భార్య మృతదేహాన్ని చూసి భయంతో ఇంటి నుంచి బయటకు వచ్చాడు. అనంతరం లాలాపేట్ రైల్వే బ్రిడ్జి వద్ద రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఏడాదిన్నర క్రితమే చరణప్ప, లక్ష్మికి వివాహమైనట్లు తెలిసింది.


స్థానికుల వివరాల ప్రకారం.. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని తెలుస్తోంది. నాచారంలో ఫుట్‌పాత్‌పై టీ స్టాల్ నిర్వహిస్తూ చరణప్ప జీవనం సాగించేవాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు సహా ఇతర కారణాలపై లాలాగూడ, సికింద్రాబాద్ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించి, కుటుంబ సభ్యులు, బంధువులకు సమాచారం అందించారు. రెండు ఘటనలపై కేసులు నమోదు చేసి పూర్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

అంతర్జాతీయ అనిశ్చితులు.. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు

ఈసీఐ వెబ్‌సైట్‌లో ‘సర్‌’ నోటీసులు

Read Latest AP News And Telangana News

Updated Date - Sep 10 , 2026 | 02:17 PM