Share News

అసెంబ్లీ ఘటనపై కీలక పరిణామం.. కేటీఆర్ పీఏ, పీఆర్ఓ‌కు నోటీసులు

ABN , Publish Date - Sep 13 , 2026 | 09:07 PM

హైదరాబాద్‌లో కేటీఆర్ పీఏ, పీఆర్‌ఓకు పోలీసులు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే..

అసెంబ్లీ ఘటనపై కీలక పరిణామం.. కేటీఆర్ పీఏ, పీఆర్ఓ‌కు  నోటీసులు
KTR PA police notice

హైదరాబాద్, సెప్టెంబర్ 13: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పీఏ, పీఆర్‌ఓకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కేటీఆర్ పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్‌ఓ మహేష్‌కు సైఫాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అసెంబ్లీ గేట్-3 వద్ద ఈ నెల 7న చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు.


నోటీసుల మేరకు మహేందర్‌రెడ్డి, మహేష్ రేపు సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాల్సి ఉంది. అసెంబ్లీ గేట్-3 వద్ద జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటన సమయంలో ఏం జరిగింది? అక్కడ ఎవరు ఉన్నారు? ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేటీఆర్ పీఏ, పీఆర్‌ఓను విచారించేందుకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. రేపటి విచారణలో పోలీసులు ఏ అంశాలపై ప్రశ్నలు అడగనున్నారనేది ఆసక్తికరంగా మారింది.


ఈ వార్తలనూ చదవండి:

అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవాలి: మోదీ

‘రా రా కన్నా’.. కొడుకు కోసం నదీ తీరంలో ఓ తల్లి నిరీక్షణ

Updated Date - Sep 13 , 2026 | 09:43 PM