కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు.. సచివాలయ వర్గాల్లో ఆసక్తికర చర్చ!
ABN , Publish Date - Jul 02 , 2026 | 08:03 PM
తెలంగాణ కేబినెట్ సమావేశానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం సచివాలయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నిన్ననే విదేశీ పర్యటన ముగించుకుని వచ్చినప్పటికీ ఆమె ఈ భేటీకి దూరంగా ఉండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
హైదరాబాద్, జులై 2: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశానికి రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కీలక మంత్రిమండలి సమావేశానికి ఆమె రాకపోవడంపై సచివాలయ వర్గాలతో పాటు రాజకీయంగానూ పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్ననే సురేఖ తన విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చినప్పటికీ, ఈ రోజు జరిగిన కేబినెట్ భేటీకి రాకపోవడం వెనుక బలమైన కారణాలే ఉండి ఉంటాయని అంతా భావిస్తున్నారు.
ప్రధానంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ బోర్డు ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన వ్యవహారమే మంత్రి కొండా సురేఖ అసంతృప్తికి కారణమనే ప్రచారం జోరుగా సాగుతోంది. తన శాఖకు సంబంధించిన అత్యంత కీలకమైన ఈ బోర్డు ఏర్పాటు విషయంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తన అభిప్రాయాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోలేదనే భావనతో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో తీవ్ర అలక పూనిన కారణంగానే కొండా సురేఖ ఉద్దేశపూర్వకంగానే ఇవాల్టి కేబినెట్ సమావేశానికి దూరంగా ఉన్నారని సచివాలయ వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్ బోడుప్పల్‌లో భూ పోరాటం.. కవిత అరెస్ట్
‘మీ అవినీతిని మాకు అంటించాలని చూస్తున్నారా’.. బీఆర్‌ఎస్‌పై పొంగులేటి ఫైర్
Read Latest Telangana News And Telugu News