Kodada Custodial Death: రాజేష్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి: కల్వకుంట్ల కవిత
ABN , Publish Date - Jan 04 , 2026 | 05:35 PM
కోదాడ పట్టణంలో కస్టోడియల్ డెత్ మృతుడు కర్ల రాజేష్ కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ పరామర్శించారు. రాజేష్ మృతికి ప్రభుత్వం బాధ్యత వహించాలని, మృతికి కారుకులైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రజ్యోతి, జనవరి 4: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో జరిగిన కస్టోడియల్ డెత్ కేసులో మృతుడు కర్ల రాజేష్ (30, దళిత యువకుడు) కుటుంబాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ పరామర్శించారు. నవంబర్ 2025లో పోలీస్ కస్టడీలో రాజేష్ మరణించిన ఘటనపై కవిత తీవ్రంగా స్పందించారు.
రాజేష్ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, నేరస్థులైన పోలీసులను కఠినంగా శిక్షించాలని కవిత డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే నలమద పద్మావతి రెడ్డి 'ప్రజలే నా కుటుంబం' అని చెప్పుకుంటూ.. బాధిత కుటుంబానికి న్యాయం ఎందుకు చేయడం లేదని కవిత ప్రశ్నించారు.
అలాగే, స్థానిక మంత్రి కూడా రాజేష్ మరణానికి బాధ్యత వహించాలని ఆమె అన్నారు. దశలవారీగా న్యాయం కోసం పోరాడుతున్న దళిత సోదరులకు కవిత అభినందనలు తెలిపారు. ఈ ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ విచారణ జరుపుతోంది.. కొందరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. బాధిత కుటుంబం.. మృతుడు రాజేష్ పోలీసు హింసకు గురైనట్టు ఆరోపిస్తోంది. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని కవిత అంటున్నారు.
ఇవీ చదవండి: