నర్సు కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా
ABN , Publish Date - Sep 02 , 2026 | 05:32 AM
హైదరాబాద్‌లో హత్యాచారానికి గురైన ప్రైమ్‌కేర్ ఆసుపత్రి నర్సు కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు డబుల్ బెడ్‌రూం ఇల్లు, ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని మంత్రి ధనసరి సీతక్క హామీ ఇచ్చారు.
డబుల్ ఇల్లు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం
బాధిత కుటుంబానికి మంత్రి సీతక్క హామీ
తక్షణ సాయంగా 2.30లక్షలు అందజేత
కొత్తగూడెం/ములకలపల్లి, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లో హత్యాచారానికి గురైన ప్రైమ్‌కేర్ ఆసుపత్రి నర్సు కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియాతోపాటు డబుల్ బెడ్‌రూం ఇల్లు, ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని మంత్రి ధనసరి సీతక్క హామీ ఇచ్చారు. మంగళవారం ఆమె కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ధైర్యం చెప్పారు. తక్షణ సాయం కింద మహిళా, స్ర్తీ సంక్షేమ శాఖ ద్వారా రూ.లక్ష, ఐటీడీఏ నుంచి రూ. 30వేలు అందించారు. అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ వ్యక్తిగతంగా రూ.లక్ష సాయం అందిస్తున్నారని తెలిపారు. బాధిత కుటుంబానికి జీవనోపాధి కోసం భూమి కేటాయించే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ నిర్వహించి, హంతకుడికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని సీతక్క హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
నేపాల్ వరదలు.. కళ్లెదుటే బురద నీటిలో భార్య కొట్టుకుపోవడంతో..
అసదుద్దీన్ ఒవైసీకి షాక్..!.. పక్క చూపులు చూస్తున్న ఏఐఎంఐఎం సీనియర్ నేత