కొత్తగూడెం విమానాశ్రయానికి కీలక ముందడుగు
ABN , Publish Date - Sep 02 , 2026 | 04:33 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన విమానాశ్రయం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ ప్రతిపాదిత స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం ఈ నెల 7న తెలంగాణలో పర్యటించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ఈ నెల 7న కేంద్ర సాంకేతిక బృందం పర్యటన
నాలుగైదు ప్రత్యామ్నాయ స్థలాల పరిశీలన:మంత్రి తుమ్మల
న్యూఢిల్లీ, కొత్తగూడెం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన విమానాశ్రయం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ ప్రతిపాదిత స్థలాలను పరిశీలించేందుకు కేంద్ర సాంకేతిక బృందం ఈ నెల 7న తెలంగాణలో పర్యటించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో తుమ్మల భేటీ అయ్యారు. అనంతరం ఆ వివరాలను మీడియాకు వివరించారు. గతంలో పరిశీలించిన రెండు స్థలాలు సాంకేతిక కారణాలతో విమానాశ్రయ నిర్మాణానికి అనుకూలంగా లేవని తేలడంతో, తాజాగా నాలుగు నుంచి ఐదు ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించినట్లు తుమ్మల తెలిపారు. ఈ స్థలాల్లోని భౌగోళిక, వాతావరణ పరిస్థితులతో పాటు విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సాధ్యాసాధ్యాలను కేంద్ర బృందం క్షేత్రస్థాయిలో పరిశీలిస్తుందని చెప్పారు. తెలంగాణలోని మామునూరు (వరంగల్), ఆదిలాబాద్ విమానాశ్రయాల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం కేంద్ర ప్రభుత్వంతో చర్చించే అవకాశం ఉందని తుమ్మల పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
వేదికపైనే రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను వెంబడించిన పాక్ ప్రధాని
బయటపడిన పాక్ వక్రబుద్ధి.. మోదీ ఫొటోను క్రాప్ చేసి సోషల్ మీడియాలో పోస్టు..