కరీంనగర్‌లో ఉద్రిక్తత...
ABN, Publish Date - Aug 12 , 2026 | 11:57 PM
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై అనుచిత వాఖ్యలు చేస్తూ బీజేపీ కార్పోరేటర్ బండారి వేణు సామాజిక మాద్యమాలలో పోస్ట్ చేసిన ఒక వీడియోతో కరీంనగర్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు తలెత్తాయి.
కరీంనగర్ క్రైం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌పై అనుచిత వాఖ్యలు చేస్తూ బీజేపీ కార్పోరేటర్ బండారి వేణు సామాజిక మాద్యమాలలో పోస్ట్ చేసిన ఒక వీడియోతో కరీంనగర్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు తలెత్తాయి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను దూషిస్తూ బీజేపీ కార్పొరేటర్ బండారి వేణు మంగళవారం ఒక వీడియోను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు. దీంతో బీఆర్‌ఎస్ నాయకులు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్, ఎఎంసీ మాజీ చైర్మన్ రెడ్డవేణి మధు, కార్యర్తలు బుధవారం కార్పొరేటర్ బండారి వేణు ఇంటి ముట్టడికి సన్నద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమై వెంటనే ఎమెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకుని బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కార్పొరేటర్ బండారి వేణును కూడా పోలీసులు అతని ఇంటి వద్ద అరెస్టు చేసి, సీటీసీకి తరలించారు. ఎలాంటి గొడవలు తలెత్తకుండా పోలీసులు ముందస్తు చర్యగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఎమ్మెల్యే ఇంటి వద్ద, కార్పొరేటర్ బండారి వేణు ఇంటి వద్ద పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.
ఫ కార్పొరేటర్ బండారి వేణుపై కేసు నమోదు....
ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను దూషించి, మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన బీజేపీ కార్పొరేటర్ బండారి వేణుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌గౌడ్ టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కార్పొరేటర్ బండారి వేణుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని టూటౌన్ సీఐ సృజన్‌రెడ్డి తెలిపారు.
Updated at - Aug 12 , 2026 | 11:57 PM