Share News

పెద్దపల్లి జిల్లా రామగుండంలో పేలిన తుపాకీ.. హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలు..

ABN , Publish Date - Jun 20 , 2026 | 09:29 PM

పెద్దపల్లి జిల్లా రామగుండంలో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి హెడ్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు కావడం కలకలం రేపుతోంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) సీఐఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్‌లో ఈ ఘటన జరిగింది.

పెద్దపల్లి జిల్లా రామగుండంలో పేలిన తుపాకీ.. హెడ్ కానిస్టేబుల్‌కు గాయాలు..

పెద్దపల్లి జిల్లా: రామగుండంలో ప్రమాదవశాత్తూ తుపాకీ పేలి హెడ్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు కావడం కలకలం రేపుతోంది. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC) సీఐఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్‌లో ఈ ఘటన జరిగింది. టింకు అనే కానిస్టేబుల్ తుపాకీలోని మ్యాగ్జిన్‌ను శుభ్రపరుస్తుండగా ప్రమాదవశాత్తూ పేలింది.

దీంతో అక్కడే ఉన్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌కు బుల్లెట్ తగిలింది. అప్రమత్తమైన తోటి సిబ్బంది గాయపడిన శ్రీనివాస్‌కు ఎన్టీపీసీలోని ధన్వంతరిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం తప్పడంతో సీఐఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్‌ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

27 లక్షల మంది విద్యార్థులకు విజయ పాలు అందిస్తాం: భట్టి విక్రమార్క

నీట్ అభ్యర్థులు ఒత్తిడికి లోనుకాకుండా పరీక్ష రాయాలి: సీఎం రేవంత్‌రెడ్డి

Updated Date - Jun 20 , 2026 | 09:33 PM