మున్సిపల్‌ కార్మికులకు రూ. 26 వేల కనీస వేతనం ఇవ్వాలి

ABN, Publish Date - Mar 02 , 2026 | 11:51 PM

మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ఎదట జిల్లా కమిటి ఆద్వర్యంలో కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు.

సుభాష్‌నగర్‌, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): మున్సిపల్‌ కార్మికులకు కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు డిమాండ్‌ చేశారు. కలెక్టరేట్‌ ఎదట జిల్లా కమిటి ఆద్వర్యంలో కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమల్లు మాట్లాడుతూ మున్సిపల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, మున్సిపాలిటీలో వివిద విభాగాలలో పనిచేస్తున్న ఉద్యోగ, కార్మికులకు డీఏ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో గత సంవత్సరం 55 మంది కార్మికులను తొలగించారని, వారిని తిరిగి విధుల్లోకి తీసుకొని ఐఎఫ్‌ఎంఐఎస్‌ పోర్టోల్‌లో వారి పేర్లను నమోదు చేయాలని కోరారు. మున్సిపల్‌ కార్మికుల వేతనాల నుంచి కట్‌ చేస్తున్న డబ్బులు ఈఎస్‌ఐ ఖాతాలో జమ అవుతున్నా కార్మికులకు ఈఎస్‌ఐ వైద్య సేవలు అందడం లేదన్నారు. జిల్లా కేంద్రంలో ఈఎస్‌ఐ డిస్పెన్సరీలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ రాష్ట్ర మహిళ కన్వీనర్‌ ముక్కెర బుజ్జమ్మ, జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి రవి, మానుపాటి మల్లేశం, దేవునూరి శ్యాంసుందర్‌, రాసపల్లి సరోజన, బోరగాల రాజకుమార్‌, రామగిని సులోచన, మెరుగు సంపత్‌, పురుషోత్తం రాణి, వడ్లూరి అంజయ్య, జంగాపల్లి లక్ష్మి, కూర రాజు, హన్మంతు, శంకర్‌, సిద్దు పాల్గొన్నారు.

Updated at - Mar 02 , 2026 | 11:51 PM