నషా ముక్త్‌ భారత్‌ కోసం కృషి చేద్దాం....

ABN, Publish Date - Oct 28 , 2026 | 11:38 PM

షా ముక్త్‌ భారత్‌ కోసం అందరం కృషి చేద్దామని కలెక్టర్‌ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు.

కరీంనగర్‌ క్రైం/సుభాష్‌నగర్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): నషా ముక్త్‌ భారత్‌ కోసం అందరం కృషి చేద్దామని కలెక్టర్‌ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ, ఓయూ ఎన్‌ఎస్‌ఎస్‌ సెల్‌ ఆధ్వర్యంలో నషాముక్త్‌ భారత్‌, నషాముక్త్‌ యువ ఫర్‌ వికసిత్‌ భారత్‌-2047 కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన వర్చువల్‌ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం కలెక్టర్‌ చిత్రా మిశ్రా మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత జీవితంతోపాటు కుటుంబానికి, సమాజానికి నష్టం కలిగిస్తుందన్నారు. మమవిద్యార్థులు యువత చాక్లెట్లు, ఇతర తినుబండారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రగ్స్‌ అటవాటు సరదాగా మొదలై.. జీవితాలను అంధకారంలోకి తీసుకెళ్తుందన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని వైద్య అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో టోల్‌ ఫ్రీ నెంబర్‌ 14445పై విస్తృతంగా అవగాహన కల్పించాలని. ఈ సందర్భంగా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. అంతకుముందు ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ కరీంనగర్‌ చైర్మన్‌ సంగెం లక్ష్మణరావు, మేనేజింగ్‌ కమిటీ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ తెలంగాణ చౌక్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే, ఎంప్లాయీస్‌ జేఏసీ చైర్మన్‌, టీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి, డీఎంహెచ్‌వో రాజ్‌గోపాల్‌రావు పాల్గొన్నారు.

Updated at - Oct 28 , 2026 | 11:38 PM