హైదరాబాద్‌లో కనకధార వెంచర్స్‌పై ఈడీ దాడులు.. రూ.326 కోట్ల మోసం ఆరోపణలు
ABN , Publish Date - Oct 23 , 2026 | 09:11 PM
హైదరాబాద్‌లోని కనకధార వెంచర్స్‌కు సంబంధించిన ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, అక్టోబర్ 23: నగరంలోని కనకధార వెంచర్స్‌కు సంబంధించిన ప్రదేశాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద 2026 అక్టోబర్ 23న హైదరాబాద్, సికింద్రాబాద్, మేడ్చల్ పరిధిలోని ఏడు చోట్ల తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా సంస్థ కార్యాలయంతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు నిర్వహించినట్లు ఈడీ ప్రకటించింది. సంస్థపై రూ.326.49 కోట్ల మోసానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నట్లు వెల్లడించింది.
బ్యాంకు నిధులను మళ్లించినట్లు గుర్తించిన ఈడీ.. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. బెంగళూరులో సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టింది. బ్యాంకు నిధుల వినియోగం, వాటి మళ్లింపులకు సంబంధించిన అంశాలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ సోదాల్లో లభించిన సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
దేశంలో కేసీఆర్ కీలకం కాబోయే రోజులు దగ్గరలో ఉన్నాయి: కేటీఆర్
వీసా వస్తుందో రాదోనని ఆందోళన.. అత్తాపూర్‌లో యువకుడి మృతి
Read Latest Telangana News And Telugu News