జనగామ జిల్లాలో విషాదం.. ఎలుగుబంటి దాడిలో రైతు మృతి
ABN , Publish Date - Oct 23 , 2026 | 05:57 PM
జనగామ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎలుగుబంటి దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే..
జనగామ, అక్టోబర్ 23: జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎలుగుబంటి దాడిలో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామ శివారులో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. గ్రామానికి చెందిన మిన్నలాపురం సిద్దయ్య (60) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లిన ఆయనపై ఎలుగుబంటి దాడి చేసినట్లు తెలుస్తోంది. అనుకోకుండా జరిగిన ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సిద్దయ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. రైతు మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
సిద్దయ్య తన వ్యవసాయ భూమి వద్ద పాలు పిండేందుకు వెళ్లిన సమయంలో ఎలుగుబంటి దాడి చేసినట్లు తెలుస్తోంది. సాధారణ పనుల కోసం వెళ్లిన రైతు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకోవడంతో పరిసర ప్రాంతాల రైతులు, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. పొలాల వద్దకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని స్థానికులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
దేశంలో కేసీఆర్ కీలకం కాబోయే రోజులు దగ్గరలో ఉన్నాయి: కేటీఆర్
వీసా వస్తుందో రాదోనని ఆందోళన.. అత్తాపూర్‌లో యువకుడి మృతి
Read Latest Telangana News And Telugu News