Share News

కేసీఆర్ చేసిన అప్పులకు అసలు, మిత్తి కట్టాల్సి వస్తోంది.. జగ్గారెడ్డి ఫైర్

ABN , Publish Date - Jul 01 , 2026 | 06:21 PM

కేసీఆర్ అప్పులకు అసలు, మిత్తి కట్టాలి.. కేటీఆర్ లాగా రేవంత్ ఖాళీగా లేరని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

కేసీఆర్ చేసిన అప్పులకు అసలు, మిత్తి కట్టాల్సి వస్తోంది.. జగ్గారెడ్డి ఫైర్
Revanth Reddy news

హైదరాబాద్, జులై 1: కేసీఆర్ అప్పులకు అసలు, మిత్తి కట్టాలి.. కేటీఆర్ లాగా రేవంత్ ఖాళీగా లేరని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేటీఆర్ ప్రస్తుతం పూర్తిగా ఖాళీగా ఉన్నారని, అందుకే ఎప్పుడు పడితే అప్పుడు చర్చలకు వస్తానంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కానీ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనా వ్యవహారాలతో ఎంతో బిజీగా ఉన్నారని, కేటీఆర్ లాగా ఆయన ఖాళీగా లేరని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నిరంతరం మేలు జరుగుతోందని, రోజూ ఎక్కడో ఒకచోట ఇళ్ల ప్రారంభోత్సవాల రిబ్బన్ కటింగ్‌లు అవుతున్నాయని పేర్కొన్నారు. చివరకు తన భార్య కూడా అధికారికంగా వెళ్లి ఆ రిబ్బన్ కట్ చేస్తోందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.


కేసీఆర్ ప్రభుత్వం చేసిన విపరీతమైన అప్పుల వల్ల ప్రస్తుతం రాష్ట్రంపై తీవ్ర భారం పడిందని, ఇప్పుడు ఆ అప్పులకు అసలుతో పాటు వడ్డీ కూడా కట్టాల్సి వస్తోందని జగ్గారెడ్డి అన్నారు. ఒకపక్క ఆ అప్పులు తీరుస్తూనే, మరోపక్క కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని చెప్పారు. కేవలం 10 శాతం మందికి మాత్రమే ఇంకా రుణమాఫీ జరగాల్సి ఉందని, దానిని పట్టుకుని ప్రతిపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. కేవలం రెండున్నరేళ్ల కాలంలోనే తాము ఇచ్చిన హామీల్లో 60 శాతం పూర్తి చేసి చూపామని జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

విరిగిపడిన కొండచరియ.. తృటిలో తప్పించుకున్న బైకర్

ఒడ్డుకు కొట్టుకొచ్చిన 26 అడుగుల తిమింగలం పిల్ల.. చివరికి..

Updated Date - Jul 01 , 2026 | 08:26 PM