‘ఇన్వెస్ట్ తెలంగాణ’లో ‘రక్షా ఎక్స్‌పో’
ABN , Publish Date - Oct 09 , 2026 | 06:26 AM
వచ్చే డిసెంబరు 7- 9 తేదీల మధ్య జరిగే ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ ప్రపంచ సదస్సు సందర్భంగా హైదరాబాద్‌లో భారీ ‘రక్షా ఎక్స్‌పో’ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు.
డిసెంబరు 9న ఎయిర్‌షో
హైదరాబాద్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): వచ్చే డిసెంబరు 7- 9 తేదీల మధ్య జరిగే ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ ప్రపంచ సదస్సు సందర్భంగా హైదరాబాద్‌లో భారీ ‘రక్షా ఎక్స్‌పో’ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబరు 9న ఎయిర్‌షో నిర్వహిస్తామన్నారు. రక్షా ఎక్స్‌పోపై ఆయన సమీక్షిస్తూ.. రక్షణ, వైమానిక రంగాలకు సంబంధించి సుమారు 30 శాతం కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలో డిఫెన్స్, ఏరోస్పేస్ రంగాల అభివృద్ధికి, పెట్టుబడులను ఆకర్షించడానికి రక్షా ఎక్స్‌పో కీలక వేదికగా నిలుస్తుందన్నారు. ఈ ప్రదర్శనకు జాతీయ, అంతర్జాతీయ రక్షణ, ఆయుధ తయారీ సంస్థలు, ఏరోస్పేస్ కంపెనీలను ఆహ్వానిస్తున్నామని వివరించారు.
ఈ వార్తలనూ చదవండి:
జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు!