రైతుల రుణాలపై కేంద్రం కీలక ప్రకటన
ABN , Publish Date - Mar 09 , 2026 | 06:18 PM
దేశవ్యాప్తంగా రైతులకు వ్యవసాయ రుణాలు కింద మొత్తం రూ.31,34,807 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం లోక్‌సభలో డీఎంకే సభ్యుడు రాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
న్యూఢిల్లీ, మార్చి 09: దేశవ్యాప్తంగా రైతులకు వ్యవసాయ రుణాలు కింద మొత్తం రూ.31,34,807 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సోమవారం లోక్‌సభలో డీఎంకే సభ్యుడు రాజు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. పంట రుణాలు కింద రూ.16,34,219 కోట్లు.. టర్మ్ లోన్స్ కింద రూ.15,00,588 కోట్లు ఉన్నట్లు తెలిపారు. అలాగే పలు రాష్ట్రాల రైతుల అప్పుల భారాన్ని ఈ సందర్భంగా గణాంకాలతో సహా వెల్లడించారు. ఈ జాబితాలో తమిళనాడు అగ్రస్థానంలో నిలవగా.. తెలుగు రాష్ట్రాలు ఏపీ రెండు, తెలంగాణ ఏడో స్థానాల్లో ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల వివరాలు..
ఆంధ్రప్రదేశ్: పంట రుణాలు.. రూ. 2,01,744 కోట్లు
టర్మ్ లోన్స్.. రూ.1,73,510 కోట్లు
మొత్తం: రూ. 3,75,254 కోట్లు
తెలంగాణ: పంట రుణాలు.. రూ. 95,167 కోట్లు
టర్మ్ లోన్స్.. రూ. 80,792 కోట్లు
మొత్తం: రూ. 1,75,959 కోట్లు
రాష్ట్రాల వారీగా ఎక్కువ రుణాలు ఉన్న రాష్ట్రాలు
1. తమిళనాడు: రూ.5,06,290 కోట్లు
2. ఆంధ్రప్రదేశ్: రూ.3,75,254 కోట్లు
3. మహారాష్ట్ర: రూ.3,07,293 కోట్లు
4. ఉత్తరప్రదేశ్: రూ.2,30,096 కోట్లు
5. కర్ణాటక: రూ.2,10,244 కోట్లు
6. రాజస్థాన్: రూ.1,92,293 కోట్లు
7. తెలంగాణ: రూ.1,75,960 కోట్లు
8. మధ్యప్రదేశ్: రూ.1,70,757 కోట్లు
9. గుజరాత్: రూ.1,68,460 కోట్లు
10. కేరళ: రూ.1,61,023 కోట్లు