తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:48 PM
హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసుపై అప్పీల్‌కు వెళ్లారు. రంగనాథ్‌ను తప్పించి మరో అధికారిని నియమించాలని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఆయన సవాల్ చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 1: హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసుపై అప్పీల్‌కు వెళ్లారు. రంగనాథ్‌ను తప్పించి మరో అధికారిని నియమించాలని గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును ఆయన సవాల్ చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా, మల్కాజిగిరి మండలం, లోతుకుంట గ్రామంలోని సర్వే నం. 1, 2లోని 40 ఎకరాల భూమిలో గత నెల 17వ తేదీన హైడ్రా కూల్చి వేతలు చేపట్టడాన్ని శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌పై జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ విచారణ చేపట్టారు. హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి రంగనాథ్‌ను తప్పించి.. ఆ స్థానంలో మరొకరిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. న్యాయస్థానం ఆదేశాలను విచ్చలవిడిగా ధిక్కరించడంతో పాటు, పదేపదే ఉల్లంఘించే అధికారి రూల్ ఆఫ్ లాను ప్రమాదంలో నెట్టివేసే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి ఆ పదవిలో కొనసాగరాదని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
క్రికెట్‌లో కోహ్లీనే మెస్సి, రొనాల్డో.. థాయ్ ఇన్‌ఫ్లుయెన్సర్ వీడియో వైరల్
పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. చంద్రబాబు చేతుల మీదుగా విడుదల