Share News

పోలీసు ఉద్యోగాల దరఖాస్తు గడువు పొడిగింపు

ABN , Publish Date - Sep 09 , 2026 | 01:11 AM

పోలీసు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ గడువును పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు పొడిగించింది.

పోలీసు ఉద్యోగాల   దరఖాస్తు గడువు పొడిగింపు
tg police

ఈనెల 16 సాయంత్రం వరకు దరఖాస్తులకు అవకాశం

హైదరాబాద్‌, సెప్టెంబరు8(ఆంధ్రజ్యోతి) : పోలీసు రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ గడువును పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు పొడిగించింది. పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు వెబ్‌సైట్‌ ద్వారా ఈనెల 16వ తేది సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని బోర్డు చైర్మన్‌ వీవీ శ్రీనివాసరావు ప్రకటించారు. పోలీసు శాఖలో నియామకాలకు పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు జూన్‌ 29న వేర్వేరుగా నాలుగు నోటిఫికేషన్లు జారీ చేసింది. పోలీసు, స్పెషల్‌ పోలీసు, అగ్నిమాపక, జైళ్ల శాఖలకు సంబంధించి 7,437 పోస్టులను భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పోస్టులకు ఇప్పటిదాకా 3,38,336మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో మహిళలు 25శాతం ఉన్నారని బోర్డు చైర్మన్‌ శ్రీనివాసరావు తెలిపారు. కాగా, ఈ దరఖాస్తు చేసిన వారిలో 2,88,530 మంది రుసుము చెల్లించి తదుపరి దశకు చేరుకున్నారని, వారిలో 2,76,085మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తులను పూర్తిగా సమర్పించారని, వీరంతా 3,80,762 వేర్వేరు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. తొలిసారిగా చేపట్టిన ఆధార్‌ ధృవీకరణ ప్రక్రియ 95 శాతం పూర్తి అయ్యిందని ఆయన పేర్కోన్నారు. చివరి నిమిషం వరకు వేచి ఉండకుండా అభ్యర్థులు వేగంగా దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు.

Updated Date - Sep 09 , 2026 | 01:59 AM