పదోన్నతులపై డీజీపీ కీలక భేటీ
ABN , Publish Date - Nov 11 , 2026 | 06:57 AM
రాష్ట్ర పోలీసు అధికారుల పదోన్నతుల అంశంలో కీలక కదలిక చోటుచేసుకుంది. ఈ విషయంపై చర్చించేందుకు గురువారం ఉదయం 11 గంటలకు డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు.
రాష్ట్ర పోలీసు అధికారుల పదోన్నతుల అంశంలో కీలక కదలిక చోటుచేసుకుంది. ఈ విషయంపై చర్చించేందుకు గురువారం ఉదయం 11 గంటలకు డీజీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. డీజీపీ సీవీ ఆనంద్‌తో పాటు కీలక అధికారులు పాల్గొననున్నారు. 1991, 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన డీఎస్పీ (సివిల్), అదనపు ఎస్పీ (నాన్ క్యాడర్) అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణలోని మూడు రేంజ్‌ల పరిధిలో పనిచేస్తున్న అధికారులతో పదోన్నతులకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు.
ఈ మేరకు డీజీపీ కార్యాలయం నుంచి మంగళవారం అన్ని పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలు, మల్టీ జోన్-1, మల్టీ జోన్-2 ఐజీలకు ఆదేశాలు పంపించారు. తమ పరిధిలోని సంబంధిత బ్యాచ్‌ల అధికారులను సమావేశానికి పంపించాలని ఆదేశించారు. డీజీపీ తరఫున మహేశ్ భగవత్ ఈ ఆదేశాలు జారీ చేశారు. పదోన్నతుల అంశంపై ఉన్నతాధికారులతో నేరుగా చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేయడం పోలీసు శాఖలో ప్రాధాన్యం సంతరించుకుంది.