Sahiti Infra Scam: సాహితీ ఇన్‌ఫ్రా స్కామ్ రూ. 3000 కోట్లుగా తేల్చిన సీసీఎస్ పోలీసులు
ABN , Publish Date - Jan 05 , 2026 | 08:28 PM
సాహితీ ఇన్ ఫ్రా స్కామ్ కేసులో ఛార్జ్ షీట్ దాఖలైంది. నాలుగేళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించి సీసీఎస్ పోలీసులు ఛార్జ్ షీట్ వేశారు. ఈ ఛార్జ్ షీట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్, జనవరి 5: రియల్ ఎస్టేట్ పేరిట భారీ మోసానికి పాల్పడ్డ సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) పోలీసులు నాలుగేళ్ల విచారణ అనంతరం మొత్తం రూ.3000 కోట్ల స్కామ్‌గా దీన్ని తేల్చారు.
'ఫ్రీ లాంచ్ ఆఫర్' పేరుతో అతి తక్కువ ధరకు ప్లాట్లు, ఫ్లాట్లు ఇస్తామంటూ వేలాది మంది కస్టమర్ల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశారు సాహితీ యాజమాన్యం. ఈ కేసులో మొత్తం 64 కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా అమీన్‌పూర్‌లోని శర్వాణి ఎలైట్ ప్రాజెక్ట్‌కు సంబంధించి 17 కేసులు ఉన్నాయి. ఈ 17 కేసుల్లో రూ.500కోట్లకు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
కంపెనీ యాజమాన్యంలోని సాహితీ లక్ష్మీనారాయణ వసూలు చేసిన డబ్బులను సొంత ప్రయోజనాలకు ఉపయోగించారని ఆరోపణలు ఉన్నాయి. మొత్తం 13 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేసిన CCS టీమ్.. పలు కేసుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.
ఈ స్కామ్ వల్ల వేలాది మంది మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి. బాధితులు గతంలో ధర్నాలు, నిరసనలు చేశారు. పోలీసుల విచారణ కొనసాగుతోంది. మిగతా కేసుల్లోనూ త్వరలో ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని అధికారులు తెలిపారు.
Also Read:
చలికాలం.. ఎక్కువగా ఆకలి వేయడానికి కారణం ఇదే
కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో కనిపించే సంకేతాలు ఇవే.!