Share News

సీఎం రేవంత్‌ని కలిసిన కొత్త డీజీపీ సీవీ ఆనంద్‌

ABN , Publish Date - Apr 30 , 2026 | 05:50 AM

రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్‌ బుధవారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

సీఎం రేవంత్‌ని కలిసిన కొత్త డీజీపీ సీవీ ఆనంద్‌

  • శాంతిభద్రతల పరిస్థితి మెరుగుదలపై సీఎం సూచనలు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నూతన డీజీపీగా నియమితులైన సీవీ ఆనంద్‌ బుధవారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తనను పూర్తిస్థాయి డీజీపీగా నియమించినందుకు గాను ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై సీఎంతో చర్చించానని, భద్రతను మరింత మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పలు సూచనలు చేశారని సీవీ ఆనంద్‌ తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా.. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి, రక్షణ కల్పించడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సీఎంకు హమీ ఇచ్చినట్లు చెప్పారు.

మే 1న సీఎంను కలిసి ధన్యవాదాలు తెలపనున్న ఆర్టీసీ జేఏసీ

తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు ఇటీవల చేసిన సమ్మె పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, అందుకు కృతజ్ఞతగా మే 1న సీఎం రేవంత్‌ రెడ్డిని కలవనున్నట్లు ఆర్టీసీ జేఏసీ నేతలు తెలిపారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలో సీఎంను ప్రత్యేకంగా కలిసి ధన్యవాదాలు తెలపనున్నామని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహించడం, కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటన వంటి పలు కీలక అంశాలపై ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేసిందని చెప్పారు.

Updated Date - Apr 30 , 2026 | 05:50 AM