పేద బ్రాహ్మణ విద్యార్థులకు అండగా బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య
ABN , Publish Date - Jun 29 , 2026 | 06:29 PM
ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ విద్యార్థులకు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అండగా నిలిచింది. విద్యా ఉపకార వేతన పథకం పేరుతో పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించింది. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా..
హైదరాబాద్: ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ విద్యార్థులకు బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అండగా నిలిచింది. విద్యా ఉపకార వేతన పథకం పేరుతో పేద బ్రాహ్మణ విద్యార్థులకు ఆర్థిక సాయం అందించింది. బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా అర్హులైన విద్యార్థులకు ఉపకార వేతన పథకానికి సంబంధించిన చెక్కులను అందజేశారు. కార్యక్రమ ముఖ్య అతిథి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఛైర్మన్ బసవరాజు శ్రీనివాస్, సినీ నటుడు ప్రదీప్, పొన్నాడ సుబ్రహ్మణ్య ప్రసాద్, సుజాతమ్మ, సీహెచ్ కృష్ణ మోహన్ తదితరుల ఆధ్వర్యంలో విద్యార్థులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ ఛైర్మన్ బసవరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. బ్రాహ్మణ పేద విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు బ్రాహ్మణ సంఘాలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.




