Share News

ప్రభుత్వ పాఠశాలల బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీగా CSR విరాళాలు

ABN , Publish Date - Jul 24 , 2026 | 07:36 PM

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న బ్రేక్‌ఫాస్ట్ పథకానికి కార్పొరేట్ సంస్థలు భారీగా చేయూతనందించాయి. సీఎస్‌ఆర్ నిధుల కింద అరబిందో ఫార్మా, దివీస్ లేబొరేటరీస్ కలిసి రూ.22.18 కోట్ల విరాళాన్ని అందించాయి.

ప్రభుత్వ పాఠశాలల బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీగా CSR విరాళాలు
Telangana Breakfast Scheme

ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న బ్రేక్‌ఫాస్ట్ పథకానికి కార్పొరేట్ సంస్థలు భారీగా చేయూతనందించాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమంలో భాగంగా అరబిందో ఫార్మా రూ.10 కోట్లు, దివీస్ లేబొరేటరీస్ రూ.12.18 కోట్లు విరాళంగా అందించాయి. దీంతో మొత్తం రూ.22.18 కోట్ల CSR నిధులు బ్రేక్‌ఫాస్ట్ స్కీం అమలుకు అందాయి. హరే కృష్ణ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అల్పాహారంతో పాటు మధ్యాహ్న భోజనం కూడా అందించనున్నారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి CSR నిధులు అందించిన అరబిందో ఫార్మా, దివీస్ లేబొరేటరీస్ సంస్థలను అభినందించారు. అదే సమయంలో సెంట్రలైజ్డ్ కిచెన్ల కోసం అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను రైతుల నుంచే నేరుగా కొనుగోలు చేసే విధానంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. రైతులను సేంద్రియ (ఆర్గానిక్) సాగు వైపు ప్రోత్సహించడం, నాణ్యమైన విత్తనాలతో పంట మార్పిడిని ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని కూడా బలోపేతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.


Also Read:

ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా?

ఈ తేదీల్లో పుట్టినవారిది రాజసమైన వ్యక్తిత్వం..!

Updated Date - Jul 24 , 2026 | 07:38 PM