ప్రభుత్వ టీచర్లకు మరో టెట్ అవకాశం
ABN , Publish Date - Oct 02 , 2026 | 06:20 AM
ప్రభుత్వ సర్వీసులో ఉన్న టీచర్లకు ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్) రాసేందుకు మరో అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
ప్రభుత్వ సర్వీసులో ఉన్న టీచర్లకు ఉపాధ్యాయ అర్హతా పరీక్ష (టెట్) రాసేందుకు మరో అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఇప్పటికే గత నెలలో ఓసారి పరీక్ష నిర్వహించగా గురువారం మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇప్పటివరకు టెట్ అర్హత సాధించని ఉపాధ్యాయులు ఈనెల 7 నుంచి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 16 నుంచి 21 వరకు పరీక్షలు ఉంటాయని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ తెలిపారు.