Hyderabad: ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. నేటి నుంచి ట్రాఫిక్ మళ్లింపు
ABN , Publish Date - Jan 15 , 2026 | 07:01 AM
నగరంలోని మలక్‌పేట ఏరియాలో రెండునెలలపాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని జాయింట్ పోలీస్ కమిషనర్(ట్రాఫిక్) డి.జోయల్ డేవిస్ తెలిపారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల నేపథ్యంలో ఈ ఆంక్షలు ఉంటాయని తెలిపారు.
- ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల నేపథ్యంలో..
హైదరాబాద్: మలక్‌పేట ఫైర్‌స్టేషన్(Malakpet Fire Station) నుంచి సంతోష్‌నగర్ యాదగిరి థియేటర్ వరకు సమగ్ర అభివృద్ధి ఎలివేటెడ్ కారిడార్(స్టీల్ బ్రిడ్జి) నిర్మాణ పనుల సందర్భంగా ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నామని జాయింట్ పోలీస్ కమిషనర్(ట్రాఫిక్) డి.జోయల్ డేవిస్(D. Joel Davis) తెలిపారు. నేటి(గురువారం) నుంచి 60 రోజుల పాటు ట్రాఫిక్ మళ్లింపులు అమలులో ఉంటాయని పెర్కొన్నారు. సైదాబాద్ వై జంక్షన్ నుంచి దోబీఘాట్ వైపు ఉన్న ఒక వైపు రోడ్డు వరకు మూసివేస్తున్నామని అన్నారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున నల్గొండ ఎక్స్ రోడ్డు నుంచి ఒవైసీ జంక్షన్(డీఎంఆర్‌ఎల్ జంక్షన్) వెళ్లే వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
మళ్లింపు పాయింట్లు, ప్రత్యామ్నాయ మార్గాలు
- నల్గొండ ఎక్స్ రోడ్డు నుంచి సైదాబాద్ వై జంక్షన్ వైపు వచ్చి సంతోష్ నగర్, ఐఎస్ సదన్ వైపు వెళ్లాలనుకునే నాలుగు చక్రాల వాహనాలు, భారీ సరుకు వాహనాలు సైదాబాద్ వై జంక్షన్ వద్ద ఎడమ వైపు తిప్పుకుని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం మీదుగా శంకేశ్వర్ బజార్‌లోని హెచ్‌పీ బంకు కుడి మలుపు తిప్పుకుని ఓనస్ ఆస్పత్రి వద్ద ఎడమ మలుపు తిప్పుకుని చంపాపేట ప్రధాన రహదారి మీదుగా యూ టర్న్ తీసుకుని చంపాపేట ఎక్స్ రోడ్డుమీదుగా ఐఎస్ సదన్ చేరుకోవాలి.

- చంచల్‌గూడ నుంచి సైదాబాద్ వై జంక్షన్ మీదుగా చంపాపేట వైపు వెళ్లాలనుకునే ద్వి, త్రిచక్ర వాహనాలను సైదాబాద్ వై జంక్షన్ వద్ద ఎడమ వైపు తిప్పుకుని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయం మీదుగా 105 బస్‌స్టాప్ వద్ద కుడి మలుపు తిప్పుకుని లక్ష్మీనగర్ వద్ద కుడి మలుపు, వినయ్ నగర్, భారత్ గార్డెన్ మీదుగా ఐఎ్‌ససదన్, చంపాపేట ప్రధాన రహదారి వైపు మళ్లిస్తారు.
- చాదర్‌ఘాట్ నుంచి ఐఎ్‌ససదన్, చంపాపేట వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను నల్గొండ ఎక్స్ రోడ్డు మీదుగా గడ్డిఅన్నారం వద్ద యూటర్న్ తీసుకుని సరూర్‌నగర్ చెరువు వద్ద కుడి మలుపు శంకేశ్వర్ బజార్‌లోని హెచ్‌పీ బంకు ఎడమ మలుపు తిప్పుకుని సింగరేణి కాలనీ, ఓనస్ ఆస్పపత్రి నుంచి చంపాపేట ప్రధాన రహదారి వైపు మళ్లిస్తారు.
- ఎంజీబీఎస్, చాదర్‌ఘాట్ నుంచి ఐఎ్‌ససదన్, చంపాపేట వైపు వెళ్లే అన్ని జిల్లాల ఆర్టీసీ బస్సులను నల్గొండ ఎక్స్ రోడ్డు, మలక్‌పేట గంజ్, మూసారాంబాగ్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, ఎల్‌బీనగర్ చౌరస్తా వైపు మళ్లిసారు.
ట్రాఫిక్ సమాచారం కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ట్రాఫిక్ ఆఫ్‌డేట్‌లను అనుసనించాలని, ప్రయాణ సమయంలో అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబరు 9010203626కి కాల్ చేయవచ్చని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
మరింత పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
20 నుంచి వన్యప్రాణుల లెక్కింపు షురూ..
Read Latest Telangana News and National News