‘టెక్నాలజీ’తో గాయాల గుట్టు
ABN , Publish Date - Sep 30 , 2026 | 02:45 AM
గాయాల కారణంగా ఎంతో మంది అథ్లెట్ల కెరీర్‌లు అర్ధంతరంగా ముగిశాయి. ఇలాంటి ప్రమాదాలకు టెక్నాలజీతో చెక్‌పెట్టేలా హైదరాబాద్‌కు చెందిన జాతీయస్థాయి షూటర్ హోమన్షిక రెడ్డి (21) ఓ పరికరం ‘సోమట్రేస్’ను ఆవిష్కరించింది.
హైదరాబాద్: గాయాల కారణంగా ఎంతో మంది అథ్లెట్ల కెరీర్‌లు అర్ధంతరంగా ముగిశాయి. ఇలాంటి ప్రమాదాలకు టెక్నాలజీతో చెక్‌పెట్టేలా హైదరాబాద్‌కు చెందిన జాతీయస్థాయి షూటర్ హోమన్షిక రెడ్డి (21) ఓ పరికరం ‘సోమట్రేస్’ను ఆవిష్కరించింది. ఈ పరికరాన్ని ధరిస్తే.. రియల్‌టైమ్‌లో వెన్నుపూస కదలికలను సెన్సార్ల ద్వారా గుర్తించే అవకాశం ఉంది. తొలుత దీన్ని రైఫిల్ షూటర్ల కోసం తయారు చేసినా.. అన్ని రకాల క్రీడాకారులకు పనికి వచ్చేలా మార్చాలనుకొంటోంది.
సాధన సమయంలో అథ్లెట్ల భంగిమలు, కదలికలను గుర్తించి.. వాటివల్ల తలెత్తే గాయాలను నివారించడానికి కోచ్‌లు, క్రీడాకారులకు ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగపడనుంది. హోమన్షిక కనిపెట్టిన ఈ పరికరం ‘శాంసంగ్ సాల్వ్ ఫర్ టుమారో 2026’ కార్యక్రమంలో టాప్-20లో నిలిచింది.
ఇవి కూడా చదవండి:
క్రికెట్‌లో భారత్ సెమీస్ ప్రత్యర్థి శ్రీలంక
ఆసియాడ్‌లో నేటి భారత షెడ్యూల్