Share News

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో విషాదం: పెంట్ హౌజ్ పైనుంచి దూకి యువకుడి బలవన్మరణం

ABN , Publish Date - Jul 25 , 2026 | 09:20 PM

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ నలందనగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎల్బీ డిగ్రీ కాలేజీ అధినేత మధుసూదన్‌రావు కుమారుడు నరైన్ పెంట్ హౌజ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పౌల్ట్రీ వ్యాపారం చేసే ఆయన గత నెలగా ముభావంగా ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో విషాదం: పెంట్ హౌజ్ పైనుంచి దూకి యువకుడి బలవన్మరణం
Rajendranagar News

హైదరాబాద్, జులై 25: నగరంలోని రాజేంద్రనగర్ నలందనగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎల్బీ డిగ్రీ కాలేజీ అధినేత మధుసూదన్‌రావు కుమారుడు నరైన్ పెంట్ హౌజ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నలందనగర్ కాలనీలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మెహిదీపట్నంలో ప్రముఖ ఎల్బీ డిగ్రీ కాలేజీ అధినేతగా ఉన్న మధుసూదన్‌రావు కుమారుడు నరైన్ పెంట్ హౌజ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నరైన్ ప్రస్తుతం పౌల్ట్రీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం సమయంలో బిల్డింగ్ పైకి వెళ్లిన అతను ఒక్కసారిగా కిందకు దూకడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.


సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ ఎస్ఐ సుమన్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గత నెల రోజులుగా నరైన్ ముభావంగా, మనోవేదనతో ఉంటున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. అయితే తమ కుటుంబానికి ఎలాంటి ఆర్థిక లేదా ఇతర ఇబ్బందులు లేవని మృతుడి తండ్రి మధుసూదన్‌రావు పోలీసులకు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల సరియైన కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు.


Also Read:

వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్‌లో కూడా శిక్షణ.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రియురాలితో మాట్లాడుతున్నాడని సహోద్యోగి హత్య..

Updated Date - Jul 25 , 2026 | 09:25 PM