Share News

హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న నాలుగు కార్లు.

ABN , Publish Date - Nov 21 , 2026 | 03:03 PM

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఓఆర్ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. ఈకో పార్క్ సమీపంలో బ్లాస్టింగ్ పనుల కారణంగా వాహనాలు నిలిచిపోగా.. వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి మరో కారును ఢీకొట్టింది. దీంతో వరుసగా నాలుగు కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొని భారీగా ధ్వంసమయ్యాయి.

హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న నాలుగు కార్లు.
Hyderabad ORR Accident

హైదరాబాద్, నవంబరు 21: నగరంలోని రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈకో పార్క్ సమీపంలో నాలుగు కార్లు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న వాహనాలు బ్లాస్టింగ్ పనుల కారణంగా రోడ్డుపై నిలిచిపోయాయి. ఇదే సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ కారు ముందు ఉన్న కారును బలంగా ఢీకొట్టింది. దీంతో వరుసగా నాలుగు కార్లు ఒకదానికొకటి ఢీకొని భారీగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో కార్లలో ప్రయాణిస్తున్న పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కొందరు ప్రయాణికులు కార్లలోనే ఇరుక్కుపోవడంతో వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు.


ఇద్దరి కాళ్లకు ఫ్రాక్చర్లు.. మరో ఇద్దరి పరిస్థితి విషమం..

ఈ ప్రమాదంలో ఇద్దరికి కాళ్లు ఫ్రాక్చర్ కాగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను వెంటనే అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు నాలుగు కార్లు ఢీకొనడంతో ఓఆర్ఆర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టడంతో క్రమంగా ట్రాఫిక్ పునరుద్ధరణ జరిగింది.


ఈ వార్తలు కూడా చదవండి

రాహుల్‌ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్.. కాంగ్రెస్‌కు నాలుగు సూటి ప్రశ్నలు..

ఆసక్తికరంగా కొలత్తూరు ఉపఎన్నిక.. ఎంకే స్టాలిన్ మళ్లీ పోటీ చేస్తారా..?

Updated Date - Nov 21 , 2026 | 03:59 PM