మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి ప్రయాణ పాస్ ధరల్లో భారీ తగ్గింపు
ABN , Publish Date - Nov 06 , 2026 | 10:50 AM
హైదరాబాద్ నగర ప్రయాణికులకు దీపావళి కానుకగా తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. మెట్రో రైలు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి కోసం ఉమ్మడి పాస్ ధరలను భారీగా తగ్గించింది.
హైదరాబాద్, నవంబర్ 6: నగర ప్రయాణికులకు దీపావళి కానుకగా తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటివరకు నెలవారీ ఉమ్మడి పాస్ ధర రూ.8,500 ఉండగా, దానిని ఏకంగా రూ.4,000కు తగ్గించారు. దీంతో ప్రయాణికులకు నెలకు రూ.4,500 వరకు ఆదా కానుంది. అలాగే.. రోజువారీ పాస్ ధరను కూడా రూ.400 నుంచి రూ.275కు తగ్గించారు. ధరల తగ్గింపుతో ప్రతిరోజూ మెట్రో, ఆర్టీసీ సేవలను వినియోగించే ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రయాణికులకు ఆర్థిక భారం తగ్గనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
కొత్త విధానం ప్రకారం.. రోజువారీ పాస్లో మెట్రో ప్రయాణానికి రూ.200, ఆర్టీసీ ప్రయాణానికి రూ.75 కేటాయించారు. ఈ పాస్ ద్వారా రోజుకు నాలుగు సింగిల్ జర్నీలు చేసుకునే అవకాశం కల్పించారు. ఇక నెలవారీ ఉమ్మడి పాస్తో గరిష్టంగా 50 రౌండ్ ట్రిప్పులు ప్రయాణించవచ్చు. తగ్గించిన కొత్త ధరలు నవంబర్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ వివరాలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. మెట్రో, ఆర్టీసీ సేవలను ఒకే పాస్తో వినియోగించుకునే వెసులుబాటుతో పాటు ధరలు తగ్గించడంతో నగర ప్రయాణికులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
16 నుంచి కొండగట్టు అంజన్న చందనోత్సవం
బీసీల భవనాలను అమ్మేందుకు రేవంత్ కుట్ర
Read Latest AP News And Telangana News