IMD Predicts Hazy Weather: అలర్ట్.. జనవరి 14న హైదరాబాద్‌లో వర్షం
ABN , Publish Date - Jan 12 , 2026 | 12:24 PM
తెలుగు రాష్ట్రాల్లో చలి వాతావరణం ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ఉష్ణోగ్రతలు అత్యంత దారుణంగా నమోదవుతున్నాయి. ఉదయం, సాయంత్రం చలి గాలులు వీస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: గత కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో చలి వాతావరణం ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. ఉష్ణోగ్రతలు అత్యంత దారుణంగా నమోదవుతున్నాయి. ఉదయం, సాయంత్రం చలి గాలులు వీస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ఠంగా 10 నుంచి 5 మధ్య నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 7 నుంచి 3 డిగ్రీలకు పడిపోతున్నాయి. ఉదయం పూట భారీగా మంచుకురుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలయినా సరే పలు ప్రాంతాల్లో చలి తగ్గటం లేదు.
హైదరాబాద్‌కు వర్ష సూచన
చలి వాతావరణంతో అల్లాడిపోతున్న హైదరాబాద్ ప్రజలకు భారత వాతావరణ శాఖ బ్యాడ్ న్యూస్ చెప్పింది. జనవరి 14న.. అంటే బుధవారం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. నగరాన్ని మబ్బులు కమ్మేసే అవకాశం ఉందని వెల్లడించింది. భారత వాతావరణ శాఖ అంచనాల మేరకు హైదరాబాద్‌లో వర్షం పడితే చలి వాతావరణం మరింత పెరిగే అవకాశం ఉంది. వర్షం కారణంగా గాల్లో తేమ పెరిగి.. దానికి చలి తోడైతే ప్రజలు అల్లాడిపోకతప్పదు. బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇవి కూడా చదవండి
2025 క్యాలెండర్ ఇంకా తీసేయలేదా? మీ అదృష్టాన్ని మీరే అడ్డుకుంటున్నారు.!
జాగ్రత్త.. ఈ 3 తప్పులు మిమ్మల్ని నవ్వులపాలు చేస్తాయి