Chanakya Niti on Respect: జాగ్రత్త.. ఈ 3 తప్పులు మిమ్మల్ని నవ్వులపాలు చేస్తాయి
ABN , Publish Date - Jan 12 , 2026 | 10:42 AM
సమాజంలో గౌరవం, గుర్తింపు పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ కొన్ని చిన్న తప్పులు మనల్ని ఇతరుల ముందు నవ్వులపాలు చేసి, మన విలువను తగ్గిస్తాయి. ఆచార్య చాణక్యుడి ప్రకారం, ఏ తప్పులు మన గౌరవాన్ని దెబ్బతీస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: సమాజంలో గౌరవం పొందాలంటే కొన్ని అలవాట్లు తప్పనిసరిగా మానుకోవాలని ఆచార్య చాణక్యుడు సూచించారు. ఎందుకంటే.. కొన్ని చిన్న తప్పులే మనల్ని ఇతరుల ముందు నవ్వులపాలు చేసి, మన విలువను తగ్గిస్తాయి. ఇప్పుడు అలాంటి మూడు ముఖ్యమైన తప్పుల గురించి తెలుసుకుందాం..
ఆలోచించకుండా వాదించడం..
ప్రతి చిన్న విషయానికీ వెంటనే వాదనకు దిగే వాళ్లను సమాజం సీరియస్‌గా తీసుకోదని చాణక్యుడు తెలిపారు. కోపంతో లేదా సరైన సమాచారం లేకుండా మాట్లాడితే మన మాటలకు విలువ ఉండదు. అలాంటి వాళ్లను ఇతరులు తేలికగా తీసుకుంటారు, ఎగతాళి కూడా చేస్తారు. కాబట్టి మన అభిప్రాయాన్ని చెప్పేముందు ఆలోచించాలి, విషయం పూర్తిగా తెలుసుకుని మాట్లాడాలి. అలా చేస్తేనే మన మాటలకు గౌరవం ఉంటుంది.
ఇతరులను అనుసరించడం..
ఇతరుల నడవడి, మాట్లాడే శైలి, జీవన విధానాన్ని అనుసరించడం మంచిది కాదని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో చెప్పారు. అలా చేస్తే మనకు ప్రత్యేక గుర్తింపు ఉండదు. ఎప్పుడూ ఇతరుల్ని అనుసరించే వ్యక్తి.. జీవితంలో ముందుకు సాగలేడు. ప్రతి ఒక్కరికీ తనకంటూ ప్రత్యేకత ఉంటుంది. మన సామర్థ్యాన్ని గుర్తించి, మనదైన మార్గంలో ముందుకు వెళ్లాలి. అప్పుడే సమాజంలో మనకు గుర్తింపు వస్తుంది.
అతిగా మాట్లాడటం..
తమకు లేని గుణాలను ఉన్నట్టు చూపించడం, ప్రతి దానిలోనూ గొప్పగా మాట్లాడటం, అవసరం లేని చోట్ల జోక్యం చేసుకోవడం వంటివి చేస్తే ఇతరులు నవ్వుతారని చాణక్యుడు వివరించారు. ఇలా చేయడం వల్ల మన ఆత్మవిశ్వాసం కూడా బలహీనంగా కనిపిస్తుంది. మాట్లాడాల్సిన చోట మాట్లాడాలి, మౌనంగా ఉండాల్సిన చోట మౌనంగా ఉండాలి. అవసరమైనప్పుడు ఆలోచించి మాట్లాడితేనే మన మాటలకు విలువ ఉంటుంది, గౌరవం పెరుగుతుంది.
(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)
Also Read:
శీతాకాలంలో తప్పనిసరిగా చేయించుకోవాల్సిన రక్త పరీక్షలు
ఉదయం అలసటగా అనిపిస్తుందా? మీ ఆరోగ్యం చెబుతున్న సంకేతం ఇదే.!
For More Latest News