Calendar Vastu Tips: 2025 క్యాలెండర్ ఇంకా తీసేయలేదా? మీ అదృష్టాన్ని మీరే అడ్డుకుంటున్నారు.!
ABN , Publish Date - Jan 12 , 2026 | 11:08 AM
మీ ఇంట్లో లేదా ఆఫీసులో ఇంకా 2025 నాటి పాత క్యాలెండర్ వేలాడుతూ ఉందా? అయితే.. ఇది మీకు తెలియకుండానే మీ పురోగతికి అడ్డంకిగా మారవచ్చని వాస్తు నిపుణులు అంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మీ ఇంట్లో లేదా ఆఫీసులో ఇంకా 2025 నాటి పాత క్యాలెండర్ వేలాడుతూ ఉందా? అయితే.. ఇది మీకు తెలియకుండానే మీ జీవితంలో అడ్డంకులు సృష్టించే కారణం కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం, గతాన్ని పట్టుకుని ఉండటం అశుభమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. పాత క్యాలెండర్‌లు మానసిక ప్రశాంతతను తగ్గించి, పురోగతికి ఆటంకం కలిగిస్తాయని అంటున్నారు.
హిందూ ధర్మంలో కాలాన్ని దేవుని రూపంగా భావిస్తారు. ప్రతి సంవత్సరం కొత్త ఆశలు, కొత్త అవకాశాలను సూచిస్తుంది. పాత సంవత్సరం ముగిసిన తర్వాత కూడా ఆ క్యాలెండర్‌ను గోడపై ఉంచడం అంటే, మన మనసు ఇంకా గతంలోనే ఉండిపోయినట్టుగా భావిస్తారు. ఇది ఆధ్యాత్మికంగానూ, మానసికంగానూ ముందుకు సాగడంలో అడ్డంకి అవుతుందని అంటారు. పాత తేదీలు, గత జ్ఞాపకాలు ఇంట్లో ఉంటే.. ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయని, శక్తి ప్రవాహం మందగిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఎందుకు అశుభంగా పరిగణిస్తారు?
వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు శక్తిని ప్రభావితం చేస్తుంది. పాత క్యాలెండర్ నిలిచిపోయిన కాలాన్ని సూచిస్తుంది. ఇది నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం, పనుల్లో ఆలస్యం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలకు కారణమవుతుందని వాస్తు నిపుణులు అంటున్నారు.
క్యాలెండర్ తీసివేయకపోతే ఏమవుతుంది?
పెద్దల నమ్మకం ప్రకారం.. పాత క్యాలెండర్‌ను చెత్తలా విసిరేయకుండా గౌరవంగా తొలగించాలి. వీలైతే రీసైకిల్ చేయాలి. అమావాస్య రోజు లేదా శనివారం వంటి రోజుల్లో తీసివేయడం మంచిదని చెబుతారు. పాత క్యాలెండర్ తీసివేసిన తర్వాత దీపం వెలిగించి.. కొత్త క్యాలెండర్ పెట్టుకోవడం శుభప్రదం. ఇలా చేస్తే ఇంట్లోకి కొత్త శక్తి, సానుకూలత వస్తుందని నమ్మకం. కాలంతో పాటు ముందుకు సాగడమే జీవితసారం. పాతదాన్ని వదిలి, కొత్తదాన్ని ఆహ్వానిస్తేనే ఆనందం, శాంతి, పురోగతి వస్తాయి. కాబట్టి మీ ఇంట్లో లేదా ఆఫీసులో ఇంకా 2025 క్యాలెండర్ ఉంటే.. ఇప్పుడే తీసివేయండి.. కొత్త భవిష్యత్తుకు స్వాగతం పలకండి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.
Also Read:
శీతాకాలంలో తప్పనిసరిగా చేయించుకోవాల్సిన రక్త పరీక్షలు
ఉదయం అలసటగా అనిపిస్తుందా? మీ ఆరోగ్యం చెబుతున్న సంకేతం ఇదే.!
For More Latest News