Share News

ఐదుగురు యువతులతో ప్రేమ వ్యవహారాలు.. చివరికి..

ABN , Publish Date - Jul 26 , 2026 | 09:06 AM

ఐదుగురు యువతులతో ప్రేమ వ్యవహారాలు నడిపి.. మరో యువతిని ట్రాప్ చేయాలని చూసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరు నెలల్లోనే అతనిపై రెండు పోక్సో కేసులు నమోదయ్యాయి..

ఐదుగురు యువతులతో ప్రేమ వ్యవహారాలు.. చివరికి..
POCSO case Hyderabad

హైదరాబాద్, జులై 26: ఐదుగురు యువతులతో ప్రేమ వ్యవహారం నడిపి.. మరో యువతని మోసం చేయాలని చూసిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని మైనర్ బాలికలను టార్గెట్ చేస్తున్న పవన్ అలియాస్ తరుణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో మోసం చేసి ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత మూడు నెలలుగా పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు.. అతని స్నేహితుడి ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ఆధారంగా బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో గత ఆరు నెలల్లోనే నిందితుడిపై రెండు పోక్సో కేసులు నమోదైనట్లు వెల్లడైంది.


పోలీసుల విచారణలో పవన్ ఐదుగురు యువతులతో ఒకేసారి ప్రేమ వ్యవహారాలు కొనసాగించినట్లు తేలింది. మరో యువతిని ఇప్పటికే వివాహం చేసుకున్నప్పటికీ మోసపూరిత చర్యలను కొనసాగించినట్లు సమాచారం. అంతేకాకుండా చోరీలు, స్నాచింగ్ కేసుల్లోనూ అతనికి నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల సంచలనం సృష్టించిన ‘రిచ్ కిడ్’ కేసు తరహాలోనే సోషల్ మీడియా ద్వారా యువతులను టార్గెట్ చేసి మోసాలకు పాల్పడుతున్నాడనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి, మరిన్ని బాధితులు ఉన్నారా అనే దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

మంత్రి రిజైన్‌ చేస్తే సరిపోదు.. మళ్లీ జరగకుండా సంస్కరణలు తేవాలి: కవిత

జరిమానాలతోనే అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట

Updated Date - Jul 26 , 2026 | 11:10 AM