Share News

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. 11 మున్సిపాలిటీల్లో హంగ్‌..

ABN , Publish Date - Feb 13 , 2026 | 01:14 PM

అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఇప్పటి వరకు 11 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు, ఎక్స్‌ అఫిషియో సభ్యులు కీలకం కానున్నారు.

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. 11 మున్సిపాలిటీల్లో హంగ్‌..
Telangana municipal

హైదరాబాద్, ఫిబ్రవరి 13: తెలంగాణ వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు,116 మున్సిపాలిటీలకు ఈనెల 11వ తేదీన ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు (శుక్రవారం) మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. అన్ని జిల్లాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతోంది. ఇప్పటికే అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది. అయితే, పలు చోట్ల అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. ఇప్పటి వరకు 11 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థులు, ఎక్స్‌ అఫిషియో సభ్యులు కీలకం కానున్నారు.


హంగ్ ఏర్పడ్డ 11 మున్సిపాలిటీ స్థానాలు..

  • పరకాల మున్సిపాలిటీ

  • అలంపూర్‌ మున్సిపాలిటీ

  • నర్సాపూర్‌ మున్సిపాలిటీ

  • సంగారెడ్డి: జిన్నారం మున్సిపాలిటీ

  • కేసముద్రం మున్సిపాలిటీ

  • ఇస్నాపూర్‌ మున్సిపాలిటీ

  • ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ

  • జమ్మికుంట మున్సిపాలిటీ

  • జనగామ మున్సిపాలిటీ

  • కామారెడ్డి మున్సిపాలిటీ

  • అమరచింత మున్సిపాలిటీ


ఇవి కూడా చదవండి

ఆంధ్రా వీరప్పన్‌కు అల్జీమర్స్‌ సోకినట్లుంది

కవిత మద్దతుతో సత్తాచాటిన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ..

Updated Date - Feb 13 , 2026 | 01:17 PM