Share News

ప్రధాన కూడళ్లలో భారీగా మోహరింపు

ABN , Publish Date - Aug 26 , 2026 | 05:14 AM

మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆమె ప్రాతినధ్యం వహిస్తున్న వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.

ప్రధాన కూడళ్లలో భారీగా మోహరింపు

మట్టెవాడ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగిస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఆమె ప్రాతినధ్యం వహిస్తున్న వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నియోజకవర్గంలో ఎలాంటి నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు జరగకుండా ముందస్తుగా అలర్ట్‌ అయ్యారు. పోలీస్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వరంగల్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని మట్టెవాడ, ఇంతెజార్‌గంజ్‌, మిల్స్‌కాలనీ, వరంగల్‌ పోచమ్మ మైదాన్‌ జంక్షన్‌, మండిబజార్‌, వరంగల్‌ చౌరస్తా, కాశిబుగ్గ జంక్షన్‌, ఎంజీఎం సెంటర్‌ తదితర ప్రాంతాల్లో మంగళవారం రాత్రి పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ప్రత్యేకంచి వరంగల్‌ సబ్‌ డివిజన్‌కు అదనపు పోలీసు వాహనాలతోపాటు అదనపు పోలీస్‌ సిబ్బందిని పంపించినట్లు తెలిసింది. డిస్ర్టిక్‌ గార్డ్‌ పోలీసులు, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నగరంలో ప్రధాన కూడళ్లకు చేరుకున్నారు.

Updated Date - Aug 26 , 2026 | 05:30 AM