అప్పులపై భట్టి అసత్యాలు చెబుతున్నారు: హరీశ్ రావు
ABN , Publish Date - Jul 04 , 2026 | 05:24 PM
తెలంగాణ రాష్ట్ర అప్పులపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసత్యాలు చెబుతున్నారని, హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.
హైదరాబాద్, జులై 4: తెలంగాణ రాష్ట్ర అప్పులపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసత్యాలు చెబుతున్నారని, హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రంలో లేని అప్పులను ఉన్నట్టుగా చూపిస్తూ కాంగ్రెస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం ఎదుర్కొంటున్న వైఫల్యాల నుంచి, తమపై జరుగుతున్న డ్యామేజ్ నుంచి తప్పించుకునేందుకే భట్టి విక్రమార్క ఇప్పుడు కొత్త డ్రామాలకు తెరలేపారని, అందులో భాగమే ఇలా మాట్లాడుతున్నారని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
హరీశ్ రావు మాట్లాడుతూ.. ‘ఎన్నికల ముందు ప్రజలను ఆకట్టుకోవడానికి కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా హామీలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేక చేతులెత్తేస్తూ ఇలాంటి కుంటిసాకులను చెబుతున్నారు. ప్రజలను నమ్మించి ఓట్లు రాబట్టుకునేందుకే ఆనాడు గ్యారంటీ కార్డులు పంచారు. తీరా ఇప్పుడు వాటిని అమలు చేయాల్సి వచ్చేసరికి రోజుకో మాట, పూటకో సాకు చెబుతూ కాలయాపన చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు కోపంతో ఊగిపోయినంత మాత్రాన వాస్తవాలు మారిపోవు. ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ఈ విధమైన రాజకీయ ఎత్తుగడలు వేస్తోంది.’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఆస్పత్రిలో 6 రోజుల పసికందును వదిలేసి తల్లిదండ్రుల పరార్
చిన్నారులకు ప్రాణం పోస్తున్న సత్యసాయి ఆస్పత్రి.. విజయ్, హరీశ్ ప్రశంసలు
Read Latest Telangana News And Telugu News