Share News

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు.. భారీగా ఆస్తినష్టం..

ABN , Publish Date - Apr 12 , 2026 | 08:39 PM

హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్‌‌తో పాటు టోలీచౌకిలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదాలు.. భారీగా ఆస్తినష్టం..
Hyderabad fire accident

ఇంటర్‌నెట్ డెస్క్: హైదరాబాద్ నగరంలోని అత్తాపూర్‌‌తో పాటు టోలీచౌకిలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి సర్వారెడ్డి కాలనీలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. డెకరేషన్ సామగ్రి గోదాములో మంటలు చెలరేగాయి. గోదాములో ప్లాస్టిక్ డెకరేషన్ వస్తువులు, ఫ్లెక్సీలు ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడుతూ.. గోదాం పక్కన ఉన్న ఇళ్లకు వ్యాపించాయి. దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది.


నల్లటి పొగ కారణంగా స్థానికులు అల్లాడిపోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అతికష్టం మీద మంటలను ఆర్పేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరో ఘటనలో.. టోలీచౌకి పారామౌంట్‌ కాలనీ చెత్తకుప్పలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటల కారణంగా సమీపంలోని కారు పూర్తిగా దగ్ధం అయింది.


ఇవి కూడా చదవండి

బెంగాల్‌ను మూడు ముక్కలు చేసేందుకే.. డీలిమిటేషన్‌పై బీజేపీని తప్పుపట్టిన మమత

రేవంత్‌ రెడ్డి పేదల ఇళ్లు కూలగొడుతున్నారు.. హరీశ్‌రావు ధ్వజం

Updated Date - Apr 12 , 2026 | 08:54 PM