తప్పిపోయిన కొడుకు పేరుతో మోసం.. తండ్రికి అనుమానం రావడంతో..
ABN , Publish Date - Oct 02 , 2026 | 11:39 AM
తప్పిపోయిన కొడుకు 24 ఏళ్ల తర్వాత తిరిగి వస్తే ఆ తండ్రి ఆనందానికి అవధులు ఉండవు. ఇబ్రహీంపట్నంలో ఓ వృద్ధుడికి కూడా అలాంటి పరిస్థితి ఎదురైనట్లే అనిపించింది. కానీ చివరకు షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్, అక్టోబర్ 2: నగరంలో ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. 24 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు పేరుతో ఓ వృద్ధుడిని మోసం చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు కేటుగాళ్ళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఘటన ఇబ్రహీంపట్నంలో చోటుచేసుకుంది. సాధువు అవతారంలో వచ్చిన ఓ వ్యక్తి.. తానే తప్పిపోయిన కొడుకునంటూ వృద్ధుడిని నమ్మించే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా.. కొడుకు దొరికాడంటూ మరికొందరు కూడా వృద్ధుడిని నమ్మించినట్లు సమాచారం. ఈ క్రమంలో నకిలీ కొడుకుగా వచ్చిన వ్యక్తి వృద్ధుడి నుంచి రూ.10 వేలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సాధువు వేషంలో ఉన్న వ్యక్తి ప్రవర్తనపై వృద్ధుడికి అనుమానం రావడంతో అసలు విషయం బయటపడింది.
తన కొడుకుకు సంబంధించిన కుటుంబ వివరాలను అడగడంతో నకిలీ కొడుకు అడ్డంగా దొరికిపోయినట్లు సమాచారం. దీంతో మోసగాళ్ల వ్యవహారంపై వృద్ధుడు ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు మోహన్‌రెడ్డి, యాదయ్యపై BNS 318(4), 319(2) కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసుపై ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 24 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు పేరును ఉపయోగించి వృద్ధుడిని మోసం చేసేందుకు ప్రయత్నించిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలనూ చదవండి:
బంగారం చోరీ.. ఏమాత్రం తగ్గని యూట్యూబర్..
భారీ మొసలిని అవలీలగా ఎత్తేసిన మహిళ.. వీడియో వైరల్..