మొయినాబాద్ డ్రగ్స్ కేస్.. కీలక విషయాలు వెల్లడించిన ఈగల్ టీమ్
ABN , Publish Date - Mar 15 , 2026 | 07:02 PM
మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో డ్రగ్ పార్టీపై ఈగల్ టీమ్ స్పందించింది. పలు కీలక విషయాలను మీడియాకు వెల్లడించింది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందని సమాచారం రావడంతో సోదాలు చేశామని తెలిపింది.
హైదరాబాద్, మార్చి 15: మొయినాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో డ్రగ్ పార్టీపై ఈగల్ టీమ్ స్పందించింది. పలు కీలక విషయాలను మీడియాకు వెల్లడించింది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ జరుగుతోందని సమాచారం రావడంతో సోదాలు చేశామని తెలిపింది. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకుని విచారించినట్లు వెల్లడించింది. ఫామ్ హౌస్‌లో కొకైన్, రివాల్వర్, కార్ట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నామని తెలిపింది. ఫామ్ హౌస్ లోపలినుంచి తుపాకి పేలిన శబ్ధం వచ్చిందని, ఆ వెంటనే ఫామ్ హౌస్‌ను చుట్టుముట్టిన ఈగల్ ఫోర్స్ సోదాలు చేసిందని చెప్పుకొచ్చింది.
పట్టుబడ్డ ఓ వ్యక్తి దగ్గరినుంచి జర్మనీ తయారీ .32 రివాల్వర్.. మరో వ్యక్తి వద్దనుంచి ఖాళీ కార్ట్రిడ్జ్ కేసులు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించింది. ఫామ్ హౌస్‌లో 0.26 గ్రాముల కొకైన్.. భారీగా బీర్, విస్కీ, వోడ్కా, ప్రీమియం లిక్కర్ బాటిల్స్ సీజ్ చేశామని తెలిపింది. 11 మందిలో 5 మందికి డ్రగ్స్ టెస్ట్‌లో పాజిటివ్ వచ్చిందని వెల్లడించింది. తదుపరి విచారణ కోసం నిందితులను మొయినాబాద్ పోలీసులకు అప్పగించామని తెలిపింది.
ఈగల్ ఎస్పీ హెచ్చరిక..
డ్రగ్స్ వాడకంపై కఠిన చర్యలు ఉంటాయని ఈగల్ ఎస్పీ గిరిధర్ హెచ్చరించారు. 14వ తేదీ సాయంత్రం నిషేధిత మత్తు పదార్థాలు తీసుకుంటున్నట్లు తమకు సమాచారం రావడంతో మొయినాబాద్ ఫామ్‌హౌస్‌పై రైడ్స్ చేశామని తెలిపారు. డ్రగ్స్ ఎక్కడ నుంచి తీసుకువచ్చారనే పూర్తి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీగా చేయాలన్నదే ఈగల్ టీమ్ లక్ష్యమని.. ఆ విధంగా పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
పోలీసుల ఎదుట లొంగిపోయిన 11 మంది నక్సలైట్లు
ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌పై డ్రగ్స్ కేసు.. సీఎం చంద్రబాబు ఆగ్రహం..