ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌పై డ్రగ్స్ కేసు.. సీఎం చంద్రబాబు ఆగ్రహం..
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:21 PM
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్‌పై ఆరోపణలను చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎంపీ మహేశ్‌ను పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.
మొయినాబాద్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేశ్‌పై ఆరోపణలను చంద్రబాబు సీరియస్‌గా తీసుకున్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎంపీ మహేష్‌ను పార్టీ అధిష్ఠానం ఆదేశించింది. ఆరోపణలకు సంబంధించి వివరణ కోరుతూ పుట్టా మహేశ్‌కు నోటీసులు ఇవ్వాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను చంద్రబాబు ఆదేశించారు (CM Chandrababu reaction).
ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన అంశంపై నివేదిక ఇవ్వాలని పల్లా శ్రీనివాస్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు (Putta Mahesh allegations). డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వ్యక్తులు, నేతలు చేసే తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని సీఎం చంద్రబాబు తేల్చి చెప్పారు. కాగా, డ్రగ్స్ కేసులో అరెస్టైన పుట్టా మహేశ్‌కు స్టేషన్ బెయిల్ లభించడంతో విడుదలయ్యారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ అణు కేంద్ర నగరంపై దాడులు.. విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ విమానాలు..
మీది డేగ చూపు అయితే.. ఇసుకలో దాక్కున్న పామును 5 సెకెన్లలో కనిపెట్టండి