Share News

గోదావరి-కావేరీ అనుసంధానంపై నివేదికలు ఇవ్వండి

ABN , Publish Date - Nov 13 , 2026 | 04:57 AM

తెలంగాణ, ఏపీ మధ్య నీటి నిర్వహణ అంశాలపై చర్చించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ మూడో సమావేశం త్వరలోనే జరగనుంది

గోదావరి-కావేరీ అనుసంధానంపై నివేదికలు ఇవ్వండి
cwc

తెలుగు రాష్ట్రాలకుసీడబ్ల్యూసీ లేఖ

హైదరాబాద్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ, ఏపీ మధ్య నీటి నిర్వహణ అంశాలపై చర్చించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ మూడో సమావేశం త్వరలోనే జరగనుంది. ఈ నేపథ్యంలో అజెండాలు పంపించాలని, అలాగే, గోదావరి--కావేరి నదుల అనుసంధానంపై తదుపరి తీసుకున్న చర్యల వివరాలపై నివేదికలు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాలను కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) కోరింది. ఈ మేరకు రెండు రాష్ట్రాలకు లేఖలు పంపింది. గత సెప్టెంబరు 7న కమిటీ రెండో సమావేశం జరిగింది. గోదావరి--కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలని ఆ సమయంలో నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు అమలుపై ఏకాభిప్రాయం కుదిరితే రెండు రాష్ర్టాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న పలు వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే అవకాశం ఉందని కమిటీ అభిప్రాయపడింది. కాగా, గోదావరి--కావేరి అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించి జాతీయ నీటి అభివృద్థి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ఇచ్చంపల్లి నుంచి 148 టీఎంసీల నీటిని మళ్లించేలా డీపీఆర్‌ రూపొందించినట్లు సీడబ్ల్యూసీ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి..

తమిళనాడులోని జ్యువెలరీ షోరూమ్‌లో చోరీ.. రూ.25 కోట్ల ఆభరణాలు మాయం!

రసగుల్లా అనుకుని బాంబు కొరికి వ్యక్తి మృతి

Updated Date - Nov 13 , 2026 | 05:24 AM