రంజాన్ పండుగ మాత్రమే కాదు.. ఆత్మశుద్ధి చేసుకునే సమయం: సీఎం రేవంత్
ABN , Publish Date - Mar 15 , 2026 | 08:58 PM
కొందరు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రంజాన్ కేవలం పండుగ మాత్రమే కాదని, ఆత్మశుద్ధి చేసుకునే సమయమని అన్నారు.
హైదరాబాద్, మార్చి 15: రంజాన్ కేవలం పండుగ మాత్రమే కాదని, ఆత్మశుద్ధి చేసుకునే సమయమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ప్రభుత్వం ముస్లింలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. కొందరు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘అజరుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చాం. సీనియర్ నేత షబ్బీర్ అలీకి సలహాదారు పదవి ఇచ్చాం’..
‘8 మంది మైనారిటీ నేతలకు కార్పొరేషన్ పదవులు ఇచ్చాం. క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్పీ ఉదోగ్యం ఇచ్చాం. బాక్సర్ నిక్కత్ జరీన్‌కు 2 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రోత్సహించాము. ప్రతీ ప్రభుత్వ కార్యక్రమంలో మైనార్టీలకు సింహ భాగం ఇస్తున్నాం. అంతా కలిసి మెలిసి దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి. వైఎస్ హయాంలో మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. రిజర్వేషన్ల వల్ల అనేక మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ ప్రభుత్వం మీది, నేను మీ సోదరుడిని. మీ ఆశీస్సులు ప్రభుత్వానికి కావాలి. మనం కలిసి మెలసి తెలంగాణను ముందుకు తీసుకెళ్లాలి. దేశంలో తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకు వెళ్దాం’ అని అన్నారు.
22న రైతు భరోసా మొదటి విడత నిధులు
ఈ నెల 22వ తేదీన రైతు భరోసా మొదటి విడత నిధులు విడుదల విడుదల కానున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్ట నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. ఈ మేరకు రైతు భరోసా నిధుల విడుదలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించారు. తొలి విడతగా మొత్తం 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఒక ఎకరం వరకు రైతు భరోసా కింద రూ.3,590 కోట్లు బదిలీ చేయనున్నారు. రెండో విడతగా 20 రోజుల తర్వాత రూ.2,650 కోట్లు రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా మొత్తం రైతు భరోసా నిధులు విడుదల అవ్వనున్నాయి. మూడు విడతల్లో కలిపి మొత్తంగా రైతుల ఖాతాల్లోకి సుమారు రూ.9 వేల కోట్లు చేరనున్నాయి.
ఇవి కూడా చదవండి
ఏపీలో జగన్‌కు లేని హోదా.. ఇక్కడ కేసీఆర్‌కు ఇచ్చాం: మంత్రి కోమటిరెడ్డి
పుట్టా మహేశ్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: సీపీఎం