పుట్టా మహేశ్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలి: సీపీఎం
ABN , Publish Date - Mar 15 , 2026 | 08:13 PM
మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సీపీఎం ఓ ప్రకటన విడుదల చేసింది. పుట్టా మహేశ్‌ను పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని సీపీఎం నేత శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
మొయినాబాద్ డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడిన ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని సీపీఎం ఓ ప్రకటన విడుదల చేసింది. పుట్టా మహేశ్‌ను పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హుడిగా ప్రకటించాలని సీపీఎం నేత శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మహేశ్‌పై చర్యలు తీసుకుని డ్రగ్స్ నివారణలో తమ చిత్తశుద్దిని తెలుగుదేశం పార్టీ నిరూపించుకోవాలని సూచించారు (Eluru MP controversy).
బాధ్యతాయుత పదవిలో ఉన్న పుట్టా మహేశ్ డ్రగ్స్ పార్టీలో పాల్గొని తన హోదాను దుర్వినియోగం చేశాడని, తక్షణమే అతడి పార్లమెంటరీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఓ ఎంపీ పట్టుబడడం ద్వారా రాజకీయ నాయకులకు, డ్రగ్స్ మాఫియాకు ఉన్న బంధం మరోసారి బహిర్గతమైందన్నారు (CPM demands disqualification).
రాజకీయ నాయకుల మద్దతు లేకుండా డ్రగ్స్ వ్యాపారం (TDP MP Putta Mahesh), విస్తరణ జరగడం లేదని, ఇప్పటికైనా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న డ్రగ్స్ వ్యాపారులను, మద్దతు దారులను రాజకీయాల నుంచి బహిష్కరించి తమ నిబద్దతను రుజువు చేసుకోవాలని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ అణు కేంద్ర నగరంపై దాడులు.. విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ విమానాలు..
మీది డేగ చూపు అయితే.. ఇసుకలో దాక్కున్న పామును 5 సెకెన్లలో కనిపెట్టండి