Share News

బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలో బాల్క సుమన్ బలయ్యాడు: ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్

ABN , Publish Date - May 30 , 2026 | 04:53 PM

బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న రాజకీయ నాటకాల్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ దారుణంగా బలయ్యాడని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అనుసరిస్తున్న రాజకీయ శైలిపై ఆయన నిప్పులు చెరిగారు.

బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలో బాల్క సుమన్ బలయ్యాడు: ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్
Addanki Dayakar Comments

హైదరాబాద్, మే 30: బీఆర్ఎస్ పొలిటికల్ డ్రామాలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బలయ్యాడని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నాయకులు వాడుతున్న భాష, చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. శనివారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ అగ్రనాయకత్వం అనుసరిస్తున్న రాజకీయ శైలిపై, వారి అణచివేత ధోరణిపై నిప్పులు చెరిగారు.


ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. ‘బాల్క సుమన్‌తో ఎవరు మాట్లాడించారో కూడా తెలియాలి. పట్టాలు కోయాలని, దాడులు చేయాలని పిలుపునివ్వడం పూర్తిగా బీఆర్ఎస్ సంస్కృతి. ఇది ముమ్మాటికీ కేసీఆర్ నైజం. ఆయనకు తెలిసిన రాజకీయ నీతి ఇదే. కేసీఆర్ తనకు తెలిసిన కుటిల రాజకీయాన్నే కొడుకు కేటీఆర్‌కు నేర్పించారు. కేటీఆర్ తనకు తెలిసిన ఆ నీతినే బాల్క సుమన్‌కు నూరిపోశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ తప్పులు చేసి, దాన్ని ప్రశ్నిస్తే జై తెలంగాణ అంటారు. ఫార్ములా రేస్ నిధుల దుర్వినియోగంపై విచారణకు వెళ్తూ కూడా కేటీఆర్ జై తెలంగాణ అంటారు. తప్పులు చేసి వాటిని గొప్పగా చెప్పుకోవడం బీఆర్ఎస్ నేతలకే చెల్లింది. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగ సంఘాలు, చివరకు రైతులను కూడా రెచ్చగొట్టడమే ఏకైక ఎజెండాగా పెట్టుకున్న బీఆర్ఎస్ నాయకులు.. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారు. సుమన్‌తో మాట్లాడించింది ఎవరో పోలీస్ అధికారులు విచారణ చేయాలి.’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి

గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారులకు ఊరట.. స్వదేశానికి వెళ్లాల్సిందేననే నిబంధనపై అమెరికా యూటర్న్..

వైభవ్ శరీరమే లక్ష్యంగా బౌలింగ్.. గుజరాత్ బౌలర్లపై ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..

Updated Date - May 30 , 2026 | 05:03 PM