Share News

బీజేఎల్పీలో భగ్గుమన్న విభేదాలు

ABN , Publish Date - Sep 19 , 2026 | 06:03 AM

బీజేపీ శాసనసభాపక్షం (బీజేఎల్పీ)లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. అసెంబ్లీ లాబీలోని బీజేఎల్పీ కార్యాలయంలోనే ఎమ్మెల్యేల మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వాదం జరిగింది.

బీజేఎల్పీలో భగ్గుమన్న విభేదాలు
Telangana BJP MLAs

  • సభలో ఒకరిద్దరే మాట్లాడటంపై ఇతర ఎమ్మెల్యేల అభ్యంతరం

  • ఎందుకు అవకాశం ఇవ్వట్లేదని నిలదీత

  • కార్యాలయంలోనే తీవ్ర వాగ్వాదం

హైదరాబాద్‌, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): బీజేపీ శాసనసభాపక్షం (బీజేఎల్పీ)లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. అసెంబ్లీ లాబీలోని బీజేఎల్పీ కార్యాలయంలోనే ఎమ్మెల్యేల మధ్య శుక్రవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒకవైపు సభ కొనసాగుతుండగానే ఎమ్మెల్యేలు వాదించుకోవటం చూసి అసెంబ్లీ సిబ్బంది అవాక్కయ్యారు. సభలో ఇద్దరు సభ్యులు మాత్రమే మాట్లాడుతున్నారని, తమకు అవకాశం ఇవ్వడం లేదని కొందరు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది.


తాము కూడా ఎన్నికైన ప్రజా ప్రతినిధులమేనని, తమకు ఎందుకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వటం లేదని ఒక ఎమ్మెల్యే నిలదీసినట్లు సమాచారం. అన్ని సబ్జెక్టులూ మీరే మాట్లాడితే ఇక మేమెందుకున్నట్లు? అని ఆయన ప్రశ్నించారని తెలిసింది. ఈ సందర్భంగా ఒక ఎమ్మెల్యే కార్యాలయం నుంచి విసురుగా బయటకు వచ్చి మరో ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ అంశం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రాంచందర్‌రావు దృష్టికి కూడా వెళ్లినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.


ఈ వార్తలను చదవండి:

ఒకటి కాదు, రెండు కాదు.. గంటలో 106 సమోసాలు.. వీడియో వైరల్

బంగారం అమ్మేసి భార్యకు ఐఫోన్ 18 ప్రో గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధమైన భర్త!

Updated Date - Sep 19 , 2026 | 06:03 AM